/rtv/media/media_files/2025/03/26/rlpkKoveKRMPkR6ksi5N.jpg)
Suhasini Maniratnam
Suhasini Maniratnam: అప్పట్లో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించారు నటి సుహాసిని . చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో అనేక సూపర్ హిట్ చిత్రాలతో అలరించారు. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని మణిరత్నం తన ఆరోగ్యానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సుహాసినికి క్షయవ్యాధి
తాను క్షయవ్యాధితో పోరాడినట్లు తెలిపారు. అయితే ఆ వ్యాధి గురించి బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో రహస్యంగా ఉంచినట్లు చెప్పారు. తనలోని ఈ భావనే సమాజం కోసం పని చేయడానికి, ప్రజలకు టిబి గురించి అవగాహన కల్పించడానికి ప్రేరేపించినట్లు వెల్లడించారు. కొన్నాళ్ల తర్వాత సుహాసిని ఈ విషయాన్ని బయటపెట్టి, టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను' అని సుహాసిని చెప్పుకొచ్చారు.
ఓ నివేదిక ప్రకారం.. నటి సుహాసినికి ఆరేళ్ల వయసులో టీబీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 36 ఏళ్ల వయసులో మరోసారి టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా ఆమెకు మల్టీ-డ్రగ్-రెసిస్టెంట్ టీబీ (MDR-TB) ఉన్నట్లు తేలింది. దీని వల్ల ఆమె తీవ్రంగా బరువు తగ్గినట్లు, వినికిడి కూడా దెబ్బతింది. అప్పుడే సుహాసిని టీబీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నారు. అప్పటివరకు తన వ్యాధి గురించి బయటకు చెబితే పరువు పోతుందేమో అని భయపడిన ఆమె.. ఆ (సెల్ఫ్ స్టిగ్మా) ను పక్కన పెట్టేశారు. 2020లో, TB రోగులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన REACH ఇండియా సంస్థలో చేరారు. టీబీతో బాధపడేవారి బాధలను, ఒంటరితనాన్ని, అపోహలను తొలగించడానికి ఆమె కృషి చేశారు. 600 మందికి పైగా టీబీ రోగులకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడ్డారు.
telugu-news | latest-news | cinema-news | actress suhasini suffering tuberculosis