/rtv/media/media_files/2025/09/06/ssmb29-scene-leaked-2025-09-06-14-07-11.jpg)
ssmb29 scene leaked
SSMB29 Scene Leaked: తెలుగు సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'SSMB29'. మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో ఇంటర్ నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా SSMB29 సెట్స్ నుంచి లీకైన ఓ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో మహేష్ ముందు సింహం ఉండగా.. ఆయన చేతిలో గొడ్డలి పట్టుకొని ఉన్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ గా కనిపించబోతున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటే ''ప్రపంచమంతా ప్రయాణించే వ్యక్తి'' అని అర్థం. ఇటీవలే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'గ్లోబ్ ట్రాటర్' అనే హ్యాష్ ట్యాగ్ తో మహేష్ బాబు హాఫ్ లుక్ విడుదల చేశారు విడుదల చేశారు. ఇందులో మహేష్ మెడ భాగం మాత్రమే కనిపిస్తూ.. మెడలో నంది, త్రిశూలం లాకెట్ తో కూడిన రుద్రాక్ష ఉంది. ఇది చూస్తుంటే ఒక పురాతన అంశానికి ఆధునికతను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Jathini Minguthunnam @urstrulyMahesh anna 🔥🥵🤙 #ssmb29#globetrotter#MaheshBabupic.twitter.com/FUuusf5MtZ
— Siva DHFM (@sivadhfmforever) September 5, 2025
గ్లోబ్ ట్రాటర్ గా మహేష్
ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ తో ఒక విజువల్ వండర్ గా 'SSMB29' ఉండబోతున్నట్లు సమాచారం. దీనికోసం దాదాపు రూ. 1500 కోట్లకు పైగా బడ్జెట్ చేస్తున్నారట మేకర్స్. దేశవిదేశాల్లోని అదద్భుతమైన లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తవగా.. ఇటీవలే ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. అయితే 'SSMB29' కథ ఆఫ్రికన్ అడవుల్లో ఎక్కువగా సాగుతుందట. ఈ మేరకు ఆఫ్రికన్ అడవుల్లో సాగే సన్నివేశాలకు సంబంధించిన 95 శాతం షూటింగ్ కెన్యాలోని నైవాషా, సంబురు, అంబోసెలి వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు.
డూప్ లేకుండా..
భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు డూప్ లేకుండా స్టెంట్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య మహేష్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి సెట్స్ నుంచి లీకైన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. 'ఇండియానా జోనస్' వంటి ఇంటర్ నేషనల్ సినిమా రేంజ్ లో దీనిని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట రాజమౌళి. సౌత్, నార్త్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో'SSMB29' ని విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అలాగే రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మొదటి చిత్రం కావడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో మహేష్ బాబు జోడీగా బాలీవుడ్ ఖ్వీన్ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.