/rtv/media/media_files/2025/11/02/ssmb-29-2025-11-02-11-56-51.jpg)
ssmb 29
SSMB29: మహేష్ బాబు- రాజమౌళి SSMB29 పై రోజురోజుకు అంచనాలు పీక్స్ కి వెళ్లిపోతున్నాయి. బాహుబలి, RRR తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ ప్రాజెక్ట్ ఇది. సినిమా మొదలై ఏడాది కావడానికి వస్తున్న ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఎట్టకేలకు ఈ నెలలో మూవీ టీజర్ లేదా టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో హీరో మహేష్ బాబునే స్వయంగా SSMB29 అప్డేట్ గురించి ఎక్స్ లో రాజమౌళిని ప్రశ్నించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్స్ లో వీరిద్దరి చాటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వీళ్ళ చాటింగ్ కి ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ కూడా రిప్లైస్ పెట్టడం మరింత ఆసక్తిగా మారింది.
SSMB29 టీమ్ చాటింగ్..
అయితే మహేష్ బాబు తన ఎక్స్ వేదికగా.. రాజమౌళి.. నవంబర్ వచ్చేసింది అప్డేట్ ఎప్పుడిస్తారు అంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి జక్కన కూడా సరదాగా బదులిస్తూ.. ఈ నెలలో ఏ సినిమాకు రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్ అని అన్నారు. దీనికి మహేష్.. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' కు రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చమత్కారం చేశారు. నవంబర్ లో అప్డేట్ ఇస్తానని ప్రామిస్ చేశారు.. మాట నిలబెట్టుకోండి అని అన్నారు. దీంతో రాజమౌళి .. ఇప్పుడే కదా మొదలైంది.. నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి ఇద్దాం.. మహేష్ నువ్వు ఇప్పటికే అన్ని సర్ప్రైజ్ లు బయటపెట్టేశావ్.. అందుకే నీ ఫస్ట్ లుక్ వాయిదా వేయాలనుకుంటున్నాను అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఈ చాటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో SSMB29 హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.
Also Read : భారత మాజీ స్టార్ క్రీడాకారుడు కన్నుమూత..
How slow sir…? Shall we start in 2030? … 🫣
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
Fyi, our Desi girl has been posting every street of Hyderabad on her Insta stories since January @priyankachopra
జక్కన్న ప్లాన్ అదిరింది..
అయితే SSMB29 టీమ్ ట్విట్టర్ చాటింగ్ పూర్తిగా ప్రమోషన్స్ లో భాగమని తెలుస్తోంది. త్వరలోనే మూవీ అప్డేట్ వస్తున్న నేపథ్యంలో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు జక్కన వినూత్నంగా ప్రమోషన్ షురూ చేశారు. హీరో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సినిమా అప్డేట్స్ గురించి ఇలా ఎక్స్ లో చాటింగ్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read: Bigg Boss 9: ఏరా భట్టు ప్రేమ కావాలా.. దివ్వెల మాధురి- భరణి స్కిట్ అదిరింది! నవ్వులే నవ్వులు
Follow Us