SSMB 29: ఈవెంట్‌ వద్ద మహేశ్ బాబు ఫ్యాన్స్ రచ్చరచ్చ.. కార్లు, బైక్‌లతో రయ్ రయ్- వండర్‌ఫుల్ విజువల్స్

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ అత్యంత భారీ అంచనాలతో రూపొందుతోంది. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ చిత్రం.. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్‌ను  మొదలెట్టింది. ఇందులో భాగంగా వరుస అప్డేట్‌లతో మూవీ యూనిట్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది.

New Update
SSMB 29 GlobeTrotter

SSMB 29 GlobeTrotter

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB29’ అత్యంత భారీ అంచనాలతో రూపొందుతోంది. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ చిత్రం.. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్‌ను  మొదలెట్టింది. ఇందులో భాగంగా వరుస అప్డేట్‌లతో మూవీ యూనిట్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. 

SSMB 29 GlobeTrotter

ఇటీవలే పోస్టర్, సాంగ్ రిలీజ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఇవాళ ఈ మూవీ యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రాటర’ అనే గ్రాండ్ ఈవెంట్‌‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో టైటిల్ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ 6 గంటలకు ప్రారంభం కానుంది. 

దీని కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాస్‌లు ఉన్నవారు ఈవెంట్‌లో సందడి చేగా.. పాస్‌లు లేని వారు ఈవెంట్ బయట రచ్చ రచ్చ చేస్తున్నారు. మహేశ్ బాబు, రాజమౌళి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు అభిమానులు ఈవెంట్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు