Baahubali 1 In Spanish: స్పానిష్‌లో బాహుబలి: ది బిగినింగ్.. కానీ ఇప్పుడెందుకు..?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి బాహుబలి: ది బిగినింగ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ విజువల్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. 

New Update
Baahubali 1 In Spanish

Baahubali 1 In Spanish

Baahubali 1 In Spanish: ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గొప్ప విజువల్ ఎపిక్‌ మాస్టర్ పీస్ “బాహుబలి: ది బిగినింగ్” ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2015లో విడుదలై భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇప్పుడు స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ప్రభాస్‌, రానా దగ్గుబాటి మధ్య భారీ పోరాటం చుట్టూ తిరిగే ఈ కథలో అనుష్క శెట్టి, తమన్నా భాటియా కీలక పాత్రల్లో అలరించారు. ఈ సినిమాను అంతర్జాతీయ మాధ్యమాల్లో మరింత విస్తృతంగా పరిచయం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం, గ్లోబల్ ఆడియన్స్‌ కోసం ఇది మంచి డెసిషన్ అనుకోవచ్చు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడివి శేష్‌ లాంటి భారీ తారాగణం తో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. విజయేంద్ర ప్రసాద్ రచించిన కథకు ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ బ్లాక్‌బస్టర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా స్థాయిని కొత్త పుంతలు తొక్కించింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఇప్పుడు స్పానిష్ భాషలో విడుదలవడం ద్వారా, బాహుబలి గాథ ప్రపంచ యాత్రలో మరో ఘట్టాన్ని చేరుకుంది. ఈ అపూర్వ ప్రయాణానికి నెట్‌ఫ్లిక్స్ వేదిక కావడం విశేషం. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ సినిమాటిక్ అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు