/rtv/media/media_files/2025/02/25/fePp2aORFJVTZhLKiljQ.jpg)
sri reddy gets bail from ap high court
నటి శ్రీరెడ్డి గురించి తెలియని వారుండరు. తరచూ ఏదో ఒక వివాదంతో ఈ నటి వార్తల్లో నిలుస్తుంది. తనది కాని విషయంలో తలదూర్చి చిక్కుల్లో పడుతుంది. ఈ క్రమంలో విమర్శలు, ట్రోల్స్ బారిన పడి సమస్యలు కొనితెచ్చుకుంటుంది. ఇప్పటికి ఆమె ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఆమె గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
అయితే అప్పుడు చేసిన వ్యాఖ్యలే ఆమెకు ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టాయి. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శ్రీరెడ్డి ప్రతిపక్ష నాయకులపై సంచలన కామెంట్స్ చేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, అలాగే ఆమె కుటుంబ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాళ్లను దూషిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టింది.
శ్రీరెడ్డిపై 6కేసులు
ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. అప్పుడు ఎవరెవరు సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలం ఉపయోగించి మాట్లాడారో వారిని కటకటాల్లోకి పంపింది. ఇందులో భాగంగానే శ్రీరెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 6 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడా కేసులలో ముందస్తు బెయిల్ కోసం నటి శ్రీరెడ్డి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
ముందస్తు బెయిల్ మంజూరు
ఇందులో భాగంగానే విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు కొన్ని షరతులతో ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు వారానికి ఓ సారి దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని శ్రీరెడ్డికి చెప్పింది. రూ.10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఇక చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే దీంతోపాటు అనకాపల్లిలో నమోదైన కేసులో సహాయ పీపీ (APP) సాయి రోహిత్ వాదనలు వినిపించారు.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
శ్రీరెడ్డి అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని ఆయన తెలిపారు. ఈ విచారణను న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి వారం రోజులకు వాయిదా వేశారు. అలాగే కృష్ణా, కర్నూల్, విజయనగరం జిల్లాలలో నమోదైన కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసు ఇవ్వాలని.. అనంతరం ఆమె నుంచి వివరణ తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.