శ్రీలీలను అక్కడ పట్టుకొని లాగేశాడు.. అంతా షాక్! వీడియో వైరల్

ఇటీవలే ఓ ఈవెంట్ పాల్గొన్న శ్రీలీలకు ఊహించని షాక్ ఎదురైంది. ఫ్యాన్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. దీంతో పక్కన ఉన్నవారు వెంటనే శ్రీలీలను బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update

Sreeleela Video: టాలీవుడ్ నటి శ్రీలీల  ప్రస్తుతం బాలీవుడ్ లో  కార్తీక ఆర్యన్ సరసన ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం కనబరిచారు. శ్రీలీలను బలవంతంగా చేయి పట్టుకొని లాగారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

శ్రీలీలను లాగేసి ఆకతాయి 

అయితే కార్తీక్ ఆర్యన్- శ్రీలీల ఫ్యాన్స్ మధ్య నుంచి నడిచి వస్తున్న క్రమంలో ఓ ఆకతాయి శ్రీలీల షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఆమె చేయి పట్టుకొని గుంపులోకి లాగేశాడు. దీంతో శ్రీలీలతో సహా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ శ్రీలీలను బయటకు తీసుకొని వచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఆకతాయిలు శ్రీలీల పట్ల ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్యమైన అమ్మాయే అలాంటి గుంపులో నడవలేదు.. ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఎలా.. బౌన్సర్లు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

latest-news | telugu-news | cinema-news | viral-video

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు