అల్లు అరవింద్ నిర్మాణంలో హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'సింగిల్'. అయితే ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ విడుదల చేయగా.. అందులోని డైలాగ్స్ వివాదాస్పదంగా మారాయి. ట్రైలర్ లో మంచు విష్ణు 'కన్నప్ప' మూవీలోని శివయ్యా.. డైలాగ్ వాడడం నెట్టింట చర్చినీయాంశమైంది. దీనిపై నెటిజన్స్ కూడా మీమ్స్ చేస్తూ మంచు విష్ణును తెగ ట్రోల్ చేశారు. అయితే ఈ విషయంపై మంచు విష్ణు, కన్నప్ప టీమ్ హార్ట్ అయ్యారని తెలుసుకున్న శ్రీవిష్ణు, అండ్ 'సింగిల్' టీమ్ క్షమాపణలు తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
This idiot Manchu Vishnu will never learn. If you corner someone and ask them not to troll you, you will be trolled more. https://t.co/YFkB98AlAh
— Adithya | ఆదిత్య R (@AdithyaIzOn) April 30, 2025
శ్రీవిష్ణు వీడియో
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ట్రైలర్ శివయ్యా.. డైలాగ్స్ వాడడంపై కన్నప్ప టీమ్ హార్ట్ అయినట్లు తెలిసింది. అది మేము కావాలని చేసింది కాదు. తప్పుగా కన్వే అయ్యింది.. మేము వెంటనే స్పందిస్తూ ఆ డైలాగ్స్ తీసేస్తున్నాము. ఇకపై సినిమాలో ఆ డైలాగ్స్ ఉండవు. మేము హార్ట్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్ వాడే సినిమా మీమ్ రెఫరెన్సులు, డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అరవింద్ గారి డైలాగ్స్ కూడా వాడాము. ఒక పాజిటివ్ ఉద్దేశంతో కామెడీ గానే ఇవన్నీ చేశాము. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ అంటూ వీడియోలో తెలిపారు.
telugu-news | latest-news | cinema-news | sree-vishnu | manchu-vishnu | shivayya dialogue | single trailer