/rtv/media/media_files/2025/03/19/166Pnjjm7R1hFcVRX61k.jpg)
space based films
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వ్యోమాగామి సునీతా విలియమ్స్, ఆమెతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఈరోజు తిరిగి భూమి పైకి చేరుకోవడంపై ప్రపంచం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు అంతరిక్ష్యం, అక్కడ జరిగే విషయాలను తెలుసుకోవడానికి స్పేస్ ఆధారంగా వచ్చిన సినిమా గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అంతరిక్ష్యం ఆధారంగా వచ్చిన సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..
Interstellar: 2014
అంతరిక్ష్యం నేపథ్యంలో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. భూమి అంతరించే ప్రమాదంలో ఉంటుంది. ఆ సమయంలో మానవాళి మనుగడ కోసం కొత్త గ్రహాన్ని కనిపెట్టేందుకు సాటర్న్ సమీపంలోని వార్మ్ హోల్ ద్వారా వ్యోమగాముల బృందం ప్రయాణించే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
Gravity: 2013
2013లో విడుదలైన ఈ చిత్రాన్ని అల్ఫోన్సో కారోన్ తెరకెక్కించారు. అంతరిక్షంలో ఉన్న హబుల్ టెలిస్కోప్‌లో టెక్నీకల్ సమస్య రావడంతో దానిని పరిష్కారించడానికి అంతరిక్షంలోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములు భూమి పైకి ఎలా తిరిగి వచ్చారు? అనేది ఈ సినిమా కథ.
First Man:
చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించిన నీల్ ఆల్డెన్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
A Space Odyssey: 2001
అంతరిక్ష్యం ఆధారంగా తెరకెక్కిన మొదటి హాలీవుడ్ సినిమాల్లో 'A Space Odyssey'. వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, సూపర్ కంప్యూటర్ HAL 9000తో కలిసి ఒక గ్రహాంతర ఏకశిలాను పరిశోధించడానికి చేసిన ప్రయాణాన్ని అనుసరిస్తుంది ఈ చిత్రం. స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అంతరిక్షం:2018
2018లో విడుదలైన ఈ చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య, అదితి రావు ప్రధాన పాత్రలో నటించారు. ఒక ఉపగ్రహాన్ని రక్షించే మిషన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
Also Read:Amitabh Bachchan: 82 ఏళ్ల వయసులో రూ. 350 కోట్ల సంపాదన.. అత్యధిక టాక్స్ కట్టిన సెలెబ్రెటీగా అమితాబ్