/rtv/media/media_files/2025/03/18/Wjf4fMcEBhkYcoDyes4o.jpg)
Amitabh Bachchan as highest tax paying celebrity
Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ళ వయసులోనూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఆదాయం, పన్ను చెల్లించిన ప్రముఖులలో అమితాబ్ ఒకరిగా నిలిచారు.
ఇది కూడా చూడండి: Return Of The Dragon: ఓటీటీలోకి 'డ్రాగన్' ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
రూ. 120 కోట్ల పన్ను
పలు నివేదికల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.350 కోట్లు సంపాదించిన అమితాబ్ రూ. 120 కోట్ల పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రెటీగా రికార్డుకు ఎక్కారు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ప్రముఖ టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి', అడ్వర్టైజింగ్ ఒప్పందాలు ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా అమితాబ్ బచ్చన్ భారీ ఆదాయం ఆర్జిస్తున్నట్లు సమాచారం. అతని అపారమైన ప్రజాదరణ కారణంగా ఇప్పటికీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు అమితాబ్ మొదటి ఎంపికగా ఉంటారు. అలా ఆయన సంపాదన రూ. 350 కోట్లకు చేరుకుంది. అంతేకాదు అమితాబ్ ఎల్లప్పుడూ సకాలంలో పన్నులు చెల్లిస్తూ బాధ్యతగల పౌరుడిగా ప్రసిద్ధి చెందారు.
ఇది కూడా చూడండి: Hibiscus: ఇది పువ్వు మాత్రమే కాదు.. మందారం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!
షారుక్ ని అధికమించి బిగ్ బీ
ఈ ఏడాది రూ.120 కోట్ల పన్ను చెల్లింపుతో.. గతేడాది రూ.92 కోట్ల పన్ను చెల్లించిన షారుఖ్ ఖాన్ ని అధికమించారు అమితాబ్. బిగ్ బీ తో పాటు అత్యధిక పన్ను చెల్లించిన ప్రముఖులలో దళపతి విజయ్: రూ. 80 కోట్లు, సల్మాన్ ఖాన్: 75 కోట్లతో ఉన్నారు. ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్‌తో పాటు వెట్టైయాన్ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్ 'కల్కి2898 AD' పార్ట్ 2 లో కూడా కనిపించనున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!