/rtv/media/media_files/2025/07/08/smriti-irani-re-entry-on-television-2025-07-08-17-55-27.jpg)
Smriti Irani re entry on television
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఒకప్పుడు స్టార్ ప్లస్‌లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీక్వెల్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సీరియల్ లో 'తులసి విరాణి' పాత్రను తిరిగి ఆమెనే చేయమని మేకర్స్ సంప్రదించగా.. స్మృతి ఇరానీ అంగీకరించారు. ఈ మేరకు తాజాగా సీరియల్ ప్రోమో కూడా విడుదల చేశారు. ప్రోమోలో సాంప్రదాయ ఆభరణాలతో మెరూన్ చీర ధరించి ఆకట్టుకున్నారు స్మృతి . దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఆమె మళ్ళీ బుల్లితెరపై కనిపించబోతున్నారు.
భారీ పారితోషకం..
అయితే స్మృతి రీఎంట్రీ కోసం మేకర్స్ భారీ పారితోషకం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 2000లో ఈ సీరియల్లో మొదటిసారి ప్రసరమైనప్పుడు ఆమెకు ఎపిసోడ్‌కు రూ.1,800 చెల్లించారట. ఇప్పుడు ఎపిసోడ్‌కు రూ. 14 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ
2000 పైగా ఎపిసోడ్లు
'క్యుంకి సాస్ భీ కబీ బహు థీ' సీరియల్ భారత టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. దాదాపు 8 సంవత్సరాలు (2000 నుంచి 2008 వరకు) ప్రసారమైన ఈ సీరీయల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2000 ఎపిసోడ్‌లకు పైగా సాగింది. ఒక కుటుంబ కథగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ భాగమైపోయింది. ఈ సీరియల్ ద్వారానే స్మృతి ఇరానీ జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించారు. తులసి విరాణి పాత్ర ఆమెకు ఇంటింటికీ సుపరిచితం చేసింది. ఇప్పుడు ఈ సీరియల్ కి సీక్వెల్ వస్తుండడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ 'బాలాజీ టెలిఫిల్మ్స్' నిర్మించనుంది.
Also Read: Kingdom Release Date: మాస్ మమ మాస్.. దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ ప్రోమో సూపరెహే
Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
smriti-irani | telugu-news