/rtv/media/media_files/2025/10/14/telusu-kada-trailer-2025-10-14-11-29-49.jpg)
Telusu Kada Censor
Telusu Kada Censor: యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటించిన కొత్త సినిమా ‘తెలుసు కదా’ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 17న దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాకు నీరజ కోన అనే కొత్త దర్శకురాలు మెగాఫోన్ పట్టింది. ప్రేమను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందింది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. మూడు ప్రధాన పాత్రల మధ్య నడిచే రిలేషన్షిప్ డ్రామా ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
ట్రైలర్‌తోనే హైప్ (Telusu Kada Trailer)
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. “ప్రేమంటే ఏంటి?”, “ఒకరినే ప్రేమించాలి అన్న రూల్ ఎవరికి?”, “ఇద్దరినీ ప్రేమించడం తప్పేంటి?” లాంటి డైలాగ్స్ ట్రైలర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇవి సినిమాను యూత్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేస్తున్నాయి. ట్రైలర్ నుంచి చూస్తే ఇది కేవలం మ్యూజికల్ లవ్ స్టోరీ కాదు, ఎమోషన్స్ నేపథ్యంలో ప్రేమకి కొత్త అర్థాన్ని చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
వైవా హర్ష కామెడీ టైమింగ్ ట్రైలర్‌లో మరొక హైలైట్‌గా నిలిచింది. అలానే సిద్ధు డైలాగ్ డెలివరీ, హావభావాలు యూత్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ట్రైలర్ వలన సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
Also Read: ప్రతీ సీన్ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రన్‌టైమ్, సెన్సార్ డీటైల్స్
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సినిమా రన్‌టైమ్ 135 నిమిషాలు (2 గంటల 15 నిమిషాలు) గా ఫిక్స్ చేశారు. ఇది లవ్ స్టోరీలకు తగ్గ చక్కటి రన్‌టైమ్ అని చెప్పొచ్చు. కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయడం, కొన్ని చిన్నచిన్న కట్‌ల తర్వాత సెన్సార్ నుంచి పాస్ అయింది.
Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మించారు. సంగీత దర్శకుడిగా తమన్ ఎస్ ఎస్ పని చేశాడు. ఇప్పటికే రిలీజైన పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
మొత్తంగా ‘తెలుసు కదా’ ట్రైలర్‌తోనే హైప్ పెంచేసింది. దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రేమపై ఓ కొత్త ఆలోచనను ఆడియన్స్‌కు చూపనుంది. సిద్ధు స్టైల్, బోల్డ్ కంటెంట్, మంచి టెక్నికల్ వర్క్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా అలరిస్తుందో చూడాలి.