Shruti Haasan: వామ్మో పెళ్లా..! నా వల్ల కాదంటున్న శృతి హాసన్

పెళ్లంటేనే భయమేస్తోంది అంటూ కోలీవుడ్ భామ శృతి హాసన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే తన లేటెస్ట్ మూవీ 'కూలీ' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి పెళ్లి పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

New Update
Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan: ''పెళ్లంటేనే భయమేస్తోంది'' అంటూ కోలీవుడ్ భామ శృతి హాసన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే తన లేటెస్ట్ మూవీ 'కూలీ' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి పెళ్లి పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ''నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం జీవితమంతా కష్టపడ్డాను! ఇప్పుడు ఆ గుర్తింపును ఓ కాగితం ముక్కతో ముదుపెట్టాలనే ఆలోచనే భయంకరంగా అనిపిస్తుంటుంది. వివాహ వ్యవస్థను నేను గౌరవిస్తాను. కానీ ఆ బంధాన్ని ధ్రువీకరించాడానికి ఒక చట్టపరమైన కాగితం అవసరంలేదని నా అభిప్రాయం! నా జీవితంలో ఒకానొక సమయంలో నేను వివాహ బంధానికి చాలా దగ్గరగా వెళ్ళాను.  కానీ, అది ముడిపడలేదు. అయినా పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించినది విషయం కాదు, అది జీవితకాలపు బాధ్యత అంటూ పెళ్లి పై తన  అభిప్రాయమని'' తెలిపింది శృతి.

ఆగస్టు 14న విడుదల

ఇదిలా ఉంటే 'కూలీ' చిత్రం ఆగస్టు 14న థియేటర్స్ లో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీ హీరోగా నటించగా.. అమీర్ ఖాన్, నాగార్జున, శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. 'జైలర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇప్పటికే  మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. 

అంతేకాదు ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే రజినీ సరసన స్టెప్పులేయనుంది. గతంలో 'జిల్ జిల్ జిగేలురాణి', ''లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా'' వంటి స్పెషల్ సాంగ్స్  చేసింది పూజ. 

Also Read:NIA Most wanted Terroist: కపిల్ శర్మ కేఫ్‌పై మెస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ ఎటాక్.. అతని చరిత్ర తెలిస్తే వణుకుతారు

Advertisment
Advertisment
తాజా కథనాలు