ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన శృతి.. అంతా వాళ్ళే చేశారంటూ కన్నీళ్లు!

తమిళ నటి శృతి నారాయణ్ ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ గా మారడం చర్చనీయంశమైంది. అయితే తాజాగా ఈ వీడియో పై శృతి స్పందించింది. ''ఇలాంటి AI- వీడియోలను షేర్ చేయడం మీకు ఒక సరదా కంటెంట్ కావచ్చు.. కానీ ఎదుటివారికి అది చాలా కష్టమైనది అని తెలిపారు.

New Update
shruthi narayan

shruthi narayan

Shruthi Narayanan: తమిళ నటి శ్రుతి నారాయణన్ ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అవడం ఇప్పుడు కోలీవుడ్ దుమారం రేపుతోంది. కొంతమంది స్కామర్లు ఆమె ఒంటిపై బట్టలు లేకుండా వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పలు వెబ్ సైట్లలో దీనిని షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

శృతి నారాయణ్ పోస్ట్ 

అయితే తాజాగా శృతి కూడా దీనిపై స్పందించారు. ఆ వీడియోను షేర్ చేయడం ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ''ఇలాంటి AI- వీడియోలను సులభంగా సృష్టించడం.. షేర్ చేయడం మీకు ఒక సరదా కంటెంట్ కావచ్చు.. కానీ ఎదుటివారికి అది చాలా కష్టమైనది అని తెలిపారు. శృతి తన పోస్టులో ఇలా పేర్కొంది.. ''నా గురించి వైరల్ అవుతున్న వీడియోలను షేర్ చేయడం మీ సరదాగా ఉండొచ్చు.. కానీ నాకు, నా స్నేహితులకు, కుటుంబానికి అది కష్టమైన పరిస్థితి. నేను ఒక అమ్మాయినే.. నాకు ఎమోషన్స్ ఉన్నాయి. మరీ ఇంతగా దిగజారి మారుస్తున్నారు. దయచేసి వీడియోను  వైరల్ చేయడం ఆపేయండి. మీకు మరీ అంతగా కావాల్సి వస్తే.. మీ చెల్లిదో, ప్రేయసి వీడియో చూడండి. వాళ్ళు కూడా అమ్మాయిలే కదా! వారికీ నాలాంటి శరీరమే ఉంటుంది. వారి ప్రైవేట్ వీడియోస్ చూసి ఆనందించండి'' అంటూ గట్టిగా బదులిచ్చింది. 

shruthi narayan post
shruthi narayan post

 చెన్నైకి చెందిన 24 ఏళ్ల శ్రుతి నారాయణన్, తమిళ వినోద పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రముఖ తమిళ సీరియల్ 'సిరగడిక్క ఆసైలో' ఆమె పాత్రకు మంచి పేరు లభించింది. 649 ఎపిసోడ్‌లకు పైగా ప్రసారం అయిన ఈ సిరీస్ వీక్షకులను ఇంకా  ఆకర్షిస్తూనే ఉంది. ఇందులో అనిల శ్రీకుమార్, శ్రీ దేవా,  ఆర్ సుందరరాజన్ వంటి ప్రఖ్యాత నటులతో పాటు శ్రుతి సహాయక పాత్రలో నటించింది. 

telugu-news | cinema-news | latest-news

Also Read:Payal Rajput: నన్ను తొక్కేసారు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే?- పాయల్

Advertisment
తాజా కథనాలు