/rtv/media/media_files/2025/10/08/shriya-reddy-2025-10-08-14-53-45.jpg)
Shriya Reddy
Shriya Reddy: తన అద్భుతమైన నటనతో, గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మదిలో మళ్లీ స్థానం సంపాదించుకున్న నటి శ్రీయా రెడ్డి, 'సలార్', 'OG' సినిమాలతో బ్లాక్‌బస్టర్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు బలమైనవే కాదు, ఆమె నటన కూడా మంచి పేరు గుర్తింపును తెచ్చాయి, ఆమె పాత్ర శక్తివంతంగా ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
ఫిట్‌నెస్‌కి ప్రాముఖ్యత..
శ్రీయా రెడ్డి నైజంగా ఒక ఫిట్ యాక్ట్రెస్. ఆమె శరీర ఆకృతి, స్టామినా, స్క్రీన్‌పై కనిపించే ఎనర్జీ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇటీవల జరిగిన OG ప్రమోషన్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ సైతం ఆమె ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించారు.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
సలార్ షూటింగ్ లో ప్రతి సీన్‌కు ముందు పుష్‌అప్స్!
తాజాగా శ్రీయా ఓ ఇంటర్వ్యూలో ‘సలార్’ షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ప్రతి సీన్‌కు ముందు 50 నుంచి 60 పుష్‌అప్స్ చేస్తూ నా శరీరాన్ని రెడీ చేసుకునేదాన్ని,” అని చెప్పారు.
Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
"అది నాకు ఓ చిన్న రొటీన్‌లా మారిపోయింది. కారవాన్‌లో, కాస్ట్యూమ్‌లోనే తక్కువ సమాయంలో చేసే వ్యాయామం ఇది. ఇలా చేస్తే నాకు శక్తి వచ్చినట్లు, ఆ పాత్రలో బలంగా కనిపిస్తున్నానన్న భావన కలిగేది," అని అన్నారు.
రాధారామ పాత్ర కోసం..
శ్రీయా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే "ఖంసార్‌లో నేను చాలా మంది మగవారి మధ్య నిలబడాల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో నేనొక శక్తివంతమైన వ్యక్తిగా కనిపించాలంటే, ముందు నా లోపలే ఆ బలాన్ని అనుభవించాలి" అన్నారు. అంటే, ఆమె పాత్రలో కనిపించే ఆత్మవిశ్వాసం కోసం మానసికంగా దృడంగా ఉండాలి.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
ప్రస్తుతం శ్రీయా రెడ్డి, ‘సలార్ పార్ట్ 2’ చిత్రంలో కూడా కనిపించనున్నారు. ఆమె పాత్రకు సినిమాలో కీలకమైన కొనసాగింపు ఉండబోతుందని సమాచారం. మొత్తానికి, శ్రీయా రెడ్డి కేవలం నటనతోనే కాదు, ఆమె డెడికేషన్, ఫిట్‌నెస్ తో కూడా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు.