కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ బంద్ కానున్నాయి. నవంబర్ 1 నుంచి షూటింగ్స్ జరగకూడదని తమిళ చిత్ర నిర్మాత మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేస్తూ.. ఈ విషయంపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
బంద్ కు కారణం అదే..
అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో.. 'నిర్మాతల సంఘం తరపున ఇప్పటికే పలు సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్‌తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది.
Also Read : దీపావళి రోజు ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్.. సడెన్ గా ఫ్యాన్స్ మధ్యలోకి
దీనిని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని వారు తెలిపారు. నిర్మాతల సమస్యలకు పరిష్కారం కనుగొనే వరకు నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు వారు నిర్ణయించాం. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది.