Manamey Ott: శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్- కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం 'మనమే'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విడుదలైన సమయంలో మంచి స్పందన వచ్చింది. కామెడీ, డ్రామా, ఎమోషన్స్ తో పక్కా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అనుకున్నంత స్థాయిలో రీచ్ లేకపోయినా.. బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.
Also Read: Tejaswi Surya: బీజేపీ ఎంపీని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. ఫొటోలు చూశారా?
𝑪𝑯𝑨𝑹𝑴𝑰𝑵𝑮 𝑺𝑻𝑨𝑹 @ImSharwanand's heartwarming entertainer #Manamey streaming now on @PrimeVideoIN 💫🤩
— Sai Satish (@PROSaiSatish) March 7, 2025
▶️ https://t.co/usWUhoUizT#ManameyOnPrimeVideo @IamKrithiShetty pic.twitter.com/ZTf15uvo7E
ఓటీటీలో మనమే.
అయితే సూమారు ఏడాది తర్వాత ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా 'మనమే' ఓటీటీ విడుదలను ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. గతేడాది జూన్ లో విడుదలైన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కంధుకూరి, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇది ఇలా ఉంటే శర్వా ప్రస్తుతం అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'రేజ్ రాజా' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. 1990 నుంచి 2000 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఈమూవీలో శర్వా బైక్ రేసర్ గా కనిపించబోతున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.