/rtv/media/media_files/2025/03/07/gnM9oaUCUnBY5uWE8yNg.jpg)
bjp mp Tejasvi Surya marriage
BJP MP Tejaswi Surya: బెంగళూరు సౌత్ బీజీపీ ఎంపీ తేజశ్వీ సూర్య తేజశ్వీ సూర్య వివాహం బుధవారం బెంగళూరులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. కర్ణాటిక్ సింగర్ శివశ్రీ స్కందప్రసాద్ తో తేజశ్వీ ఏడడుగులు వేశారు. పూర్తి సాంప్రదాయ పద్దతిలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, కేంద్ర మంత్రులు వి. సోమన్న, అర్జున్ రామ్ మేఘవాల్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర చీఫ్ కె. అన్నామలై, ఇతర బీజీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వాదాలు అందించారు.
పెళ్లి ఫొటోలు
పెళ్ళికి సంబంధించిన ఫొటోలను వరుడు, ఎంపీ తేజశ్వీ తన ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. వధువు శివశ్రీ పసుపు కాంచీపురం పట్టు చీర, బంగారు ఆభరణాలు ధరించి ఉండగా, సూర్య తెలుపు, బంగారు పంచలో అందంగా రెడీ అయ్యారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/03/07/MpIFXETIGUBF0u96dceF.png)
/rtv/media/media_files/2025/03/07/ZTxPiuPX8Y7Ni2aHLjjZ.jpg)
వధువు శివశ్రీ స్కందప్రసాద్.. శాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి బయో ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత సంగీతంలో తన వృత్తిని కొనసాగించాలని ఎంచుకుంది. ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో పట్టా పొందారు. భక్తి సంగీతాలు ముఖ్యంగా మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ఫ్రాంచైజీలో ఆమె ప్రదర్శించన పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. గాయని శివశ్రీ స్కందప్రసాద్ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో రెండు లక్షల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె సంగీతానికి ప్రధాని మోడీ సైతం ప్రశంసలు కురిపించారు.
/rtv/media/media_files/2025/03/07/srzVruMQ7NtieUP81uHw.jpg)
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్