/rtv/media/media_files/2025/04/16/MOfOQMaULKbEXyBYgwAG.jpg)
Sharwa 38
Sharwa 38: ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను గెలుచుకున్న శర్వానంద్ ప్రస్తుతం తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. శర్వా హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన "నారి నారి నడుమ మురారి" విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
ఏప్రిల్ 30, 2025న షూటింగ్
శర్వానంద్ 38వ సినిమా ప్రస్తుతం ‘శర్వా 38’ పేరుతో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సంపత్ నంది మెగాఫోన్ పట్టనున్నాడు, త్వరలో విడుదల కానున్న ఓదెల 2 సినిమాకు కూడా ఆయన క్రియేటివ్ గైడెన్స్ అందించారు. ఓదెల 2 ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సంపత్, శర్వా 38 సినిమా ఏప్రిల్ 30, 2025న అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ఈ చిత్రం 1960ల చివరలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీలో శర్వానంద్ అభిమానులకు పూర్తిగా భిన్నమైన అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఈ పాత్రలో ఆయన నటన మరో మైలురాయి చేరనుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలు సౌందర్ రాజన్ చేపట్టనున్నారు. టైటిల్, క్యాస్ట్, ఫస్ట్ లుక్ టీజర్‌లకు సంబంధించిన సమాచారం త్వరలో అధికారికంగా వెల్లడికానుంది. ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ పాన్-ఇండియా లెవెల్ ప్రాజెక్ట్‌పై మరిన్ని తాజా వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
#Sharwa38 @ImSharwanand @IamSampathNandi team up ! #SharwaSampathBloodFest 🔥 pic.twitter.com/FaZy8idpdo
— BA Raju's Team (@baraju_SuperHit) September 19, 2024