'గేమ్ ఛేంజర్' మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' మూవీని మొదట దళపతి విజయ్ తో తీయాలనుకున్నారట. ఆయనకు కథ వినిపించగా.. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఏడాదిన్నర టైం అడగటంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వల్ల అంత టైం ఇవ్వలేనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.

New Update
ram charan thalapathy vijay

ram charan thalapathy vijay

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్-ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

ట్రైలర్‌ను చూస్తే శంకర్‌ మార్క్ స్పష్టంగా కనిపిస్తూ, సామాజిక అన్యాయాలపై పోరాడే కథతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో స్టూడెంట్, పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారిగా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

ముఖ్యంగా చరణ్ మాస్ అవతార్ లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ట్రైలర్‌నే చూస్తే అర్థమవుతోంది. డైరెక్టర్ శంకర్ నిజానికి ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయాలనుకోలేదట. ఈ ప్రాజెక్టు మొదట తమిళ స్టార్ హీరో విజయ్ కోసం ప్లాన్ చేసినట్లు సమాచారం. 

శంకర్ ఈ కథను విజయ్‌కు వినిపించగా, కథ నచ్చడంతో విజయ్ కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే, శంకర్ ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో ఏడాదిన్నర సమయం కావాలని సూచించగా, విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ కారణంగా అంత సుదీర్ఘ సమయం ఇవ్వలేనని చెప్పారట. 

Also Read : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది

దీంతో శంకర్ విజయ్‌ను పక్కన పెట్టి రామ్ చరణ్‌ను ఈ ప్రాజెక్టుకు సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో విజయ్.. వెంకట్ ప్రభుతో 'గోట్' అనే మూవీ చేశాడు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు