/rtv/media/media_files/2025/03/23/e5fwsi9AFYnr4TRmcKgM.jpg)
HIT 3 Love Song
Hit 3 Song: శైలేశ్ కొలను(Sailesh Kolanu) డైరెక్టర్ గా నాని(Nani), శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లగా నటిస్తున్న మూవీ "హిట్: ది థర్డ్ కేస్". హిట్ సిరీస్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన "హిట్ 1", "హిట్ 2" సినిమాలు సూపర్ హిట్ కావడంతో "హిట్ 3" కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.
Also Read: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!
రొమాంటిక్ మెలోడీ..
ఈ సందర్భంగా, "ప్రేమ వెల్లువ..."(Prema Velluva HIT 3 Song) అనే పాట ప్రోమోను విడుదల చేసారు మూవీ టీమ్. ఔట్ అండ్ ఔట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి వస్తున్న ఫస్ట్ సాంగ్ ఇదే కావడం విశేషం. మొదటి పాటగా విడుదలవుతోన్న "ప్రేమ వెలువ..."కు మిక్కీ జె. మేయర్ అందించిన రొమాంటిక్ మెలోడీ మ్యూజిక్ తో పాటుగా నాని, శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ హైలెట్ గా నిలవనుంది.
Also Read: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ కచ్చితంగా అందరిని అలరిస్తోంది అని నాని ఇప్పటికే చాలా సందర్భాలలో ధీమా వ్యక్తం చేసారు. అయితే 1 మే 2025 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!