/rtv/media/media_files/2025/10/18/sharukh-2025-10-18-22-24-14.jpg)
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ ప్రపంచం మొత్తం ఆరాధిస్తారు. ఇండియన్సే కాదు..హాలీవుడ్..ఇతర దేశాల్లోనూ బాద్ షా ఫేమస్. అలాంటి స్టార్‌తో సెల్ఫీ తీసకునే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా. స్క్విడ్ గేమ్ స్టార్ లీ జంగ్ జే కూడా అదే చేశారు. స్వయంగా తాను కొరియన్ సూపర్ సటార్ అయినా కూడా కింగ్ ఖాన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ఆరాటపడ్డారు. దాన్ని తానే ఎక్స్‌లో పోస్ట్ కూడా చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదో పెద్ద సంచలనంగా మారింది. లీ జంగ్ పెట్టిన పోస్ట్ తె వైరల్ అవుతోంది. అందరూ దీన్ని రీ షేర్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్‌లు కలిసిన
దిగిన ఫోటో అంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు. లీ జంగ్ తన పోస్ట్‌లో షారూఖ్ ఖాన్‌ను కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఇద్దరు యాక్టర్ల అభిమానులూ దీన్ని కలిసి ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. దాంతో పాటూ తన పోస్ట్‌లో రెస్పెక్ట్‌డ్ ఐకాన్ మిస్టర్ షారూఖ్‌తో సెల్ఫీ దిగడం నాకు చాలా గౌరవం అంటూ లీ రాశాడు. ఇది కూడా సోషల్ మీడియా అభిమానులు మనసు దోచుకుంటోంది. కొరియన్ స్టార్‌లు సైతం మన నటుడిని పొగడడం గొప్ప విషయమని చెబుతున్నారు.
స్క్విడ్ గేమ్..
లీ జంగ్ జే ఒక కొరియన్ సూపర్ స్టార్. ఇతను మామూలుగానే కొరియాలో చాలా ఫేమస్. కానీ స్క్విడ్ గేమ్ సీరీస్ తరువాత మరింత పాపులర్ అయిపోయాడు. ఇందులో వచ్చిన మూడు సీజన్ లలో ఇతనే హీరో. కొంత రక్తపాతం ఉన్నా కడా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన స్క్విడ్ గేమ్ ను ప్రేక్షకులు తెగ చూశారు. మొదటి సీజన్ వచ్చాక రెండు, మూడు సీజన్ల కోసం ఆతృతగా వెయిట్ చేశారు. ఇదొక రియాలిటీ గేమ్ షోకు సంబంధించిన సీరీస్. రియాలిటీ గేమ్ షో, డబ్బులు మాయలో పడి జనాలు ఎలా ప్రాణాలు పొగొట్టుకుంటారు. చివర వరకు హీరో ఎలా ప్రాణాలతో ఉండి గెలుస్తాడు...గెలిచిన తర్వాత ఏం చేస్తాడు అనేది సీరీస్. ఈ స్క్విడ్ గేమ్ కేవలం కొరియాలోనే కాక మొత్తం ప్రపంచం అంతా ఫేమస్ అయింది.