/rtv/media/media_files/2025/07/02/priyanka-jain-shiva-kumar-2025-07-02-16-11-07.jpg)
Priyanka Jain- shiva kumar
Priyanka Jain: బుల్లితెర కపుల్ ప్రియాంక జైన్ - శివ కుమార్ జంట సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సీరియల్ లో ప్రేమికులుగా నటించిన వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమికులయ్యారు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈజంట తరచూ తమకు సంబంధించిన ఫన్నీ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ జంటకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో శివకుమార్ యాంకర్ పై విపరీతమైన కోపంతో ఊగిపోయాడు. ఏకంగా అక్కడున్న పిల్లో కుషన్ తీసి అతడిని కొట్టే వరకు వెళ్ళాడు.
అసలేం జరిగిందంటే?
ఇటీవలే ప్రియాంక- శివకుమార్ బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శివ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కాగా, ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి యాంకర్ శివ అడిగిన ప్రశ్నతో గొడవ మొదలైంది. ''మీ రిలేషన్ ఆర్టిఫీషియల్ అని, వ్యూవర్స్ కోసం యాక్ట్ చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు''! అని శివ ప్రశ్నించాడు. దీంతో ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ కుమార్.. మాది ఆర్టిఫిషియల్ రిలేషనని ఎలా అంటారు? అని యాంకర్ పై కోప్పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. లైవ్ లోనే శివ కుమార్ యాంకర్ పై పిల్లో తీసి విసిరాడు. ఇది చూసి నెటిజన్లతో ఒక్కసారి షాకయ్యారు. కానీ, ఆ తర్వాత తెలిసింది..అదంతా ప్రాంక్ అని! యాంకర్, శివ కుమార్ ఇద్దరూ కలిసి ప్రియాంకను ప్రాంక్ చేశారు. పాపం.. ఇదంతా తెలియని ప్రియాంక వాళ్ళ గొడవ చూసి భయపడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.