/rtv/media/media_files/2025/04/16/5IZ0W76rRkrqXZpj5NEM.jpg)
Sarangapani Jathakam Trailer
Sarangapani Jathakam : ట్యాలెంటెండ్ నటుడు ప్రియదర్శి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ‘కోర్టు’ మూవీ సినిమాలో తన అద్భుతమైన యాక్టింగ్‌తో సినిమా రూపాన్సే మార్చేశాడు. అందులో లాయర్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియదర్శి నటిస్తున్న కొత్త సినిమా సారంగపాణి జాతకం. ఇందులో రూప కొడువాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రైలర్ రిలీజ్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 2 నిమిషాలకు పైగా రన్ టైమ్‌తో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లతో అదిరిపోయింది.
ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్లు ఫన్నీ ఫన్నీగా సాగిపోయాయి. వీరికి తోడు వైవాహర్ష డైలాగులు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొత్తంగా ప్రియదర్శి మరో కామెడీ సినిమాతో రాబోతున్నాడనే చెప్పాలి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది.
sarangapani-jathakam | priya darshi | latest-telugu-news | telugu-news