/rtv/media/media_files/2025/09/17/sandy-master-2025-09-17-12-34-26.jpg)
Sandy Master
Sandy Master: ఫేమస్ డ్యాన్స్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న 'శాండీ మాస్టర్' ఇప్పుడు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘లియో’, ‘లోక: చాప్టర్ 1’ వంటి చిత్రాలలో విభిన్నమైన విలన్ పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షించిన శాండీ, తాజాగా తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'కిష్కింధపురి' అనే చిత్రంలో ఒక విచిత్రమైన వేషధారణలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Also Read:'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?
హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో శాండీ తన ప్రయాణాన్ని, అనుభవాలను ఇలా వివరించారు: “నా సినిమాటిక్ జర్నీకి నిజమైన టర్నింగ్ పాయింట్ ‘లియో’ చిత్రంతో మొదలైంది. ఆ సినిమాలో సైకో విలన్ పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ నన్ను ఎంపిక చేయడం నాకు చాలా ప్లస్ అయ్యింది. ఆ పాత్ర లేకపోతే ఈ రోజు ‘కిష్కింధపురి’లో నటించేందుకు అవకాశం వచుండేది కాదు,” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
‘కిష్కింధపురి’లో శాండీ పాత్ర... (Kishkindhapuri Movie Villain)
ఈ చిత్రంలో ఆయన విచిత్రమైన లుక్‌లో, చీరకట్టుతో కనిపించడం ప్రేక్షకులను షాక్ కి గురిచేసిందని చెప్పారు. “నా పాత్రను సినిమా రిలీజ్ వరకు సీక్రెట్‌గా ఉంచాం. తెరపై నన్ను ఆ విధంగా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు,” అన్నారు శాండీ.
స్ట్రీట్ డ్యాన్సర్ నుంచి యాక్టర్ గా...
“వంద, నూటయాభై రూపాయల కోసం గుళ్లలో, పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు చేసాను. నా కళ్లను చూసి చిన్నప్పుడు అందరూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ కళ్ల వల్లే నాకు 'లియో'లో సైకో పాత్ర వచ్చింది. ఇప్పుడు అదే కళ్లు నాకు గుర్తింపు తెచ్చాయి,” అని ఎమోషనల్ అయ్యారు.
Also Read: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ బిగ్ సర్ప్రైజ్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఇది..!!
శాండీ గ్లామర్, విలనిజం, డ్యాన్స్ - అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందు ‘లియో’ తర్వాత వరుసగా సైకో పత్రాలు చేస్తూ వచ్చారు, ‘లోక’, ‘కిష్కింధపురి’ చిత్రాల్లో ఒక కొత్త రకమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. “ఇప్పటి నుండి డ్యాన్స్‌కి, నటనకి సమంగా సమయం కేటాయించాలనుకుంటున్నా. కథ బాగుంటే ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉన్నా,” అన్నారు శాండీ.
Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!
రాబోయే ప్రాజెక్టులు..
- అనుష్క శెట్టి నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్’లో ప్రతినాయకుడిగా కనిపించనున్న శాండీ, జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నీలి అనే దెయ్యం పాత్రలో అనుష్క కనిపించనున్నారు.
- అలాగే, పా. రంజిత్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తూ హీరోగా కనిపించనున్నారు.
- పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకి కూడా ఆయన పాటకు కొరియోగ్రఫీ అందించారు.
ఇలా డ్యాన్స్‌తో పాటు మంచి పాత్రలతో నటుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్న శాండీ, మరిన్ని విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.