సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్ళడానికి అల్లు అర్జున్ కు పోలీసులు షరతులతో అనుమతిచ్చారు. ఈమేరకు తాజాగా రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్ కి నోటీసులు ఇచ్చారు. పరామర్శించేందుకు వెళ్లే విషయాన్ని అల్లు అర్జున్ రహస్యంగా ఉంచాలని పోలీసులు నోటీసులతో పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం గంటలోపే ముగించాలని సూచించిన పోలీసులు, ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే! బెయిల్ షరతులు ఉల్లంఘించకుండా ఉండాలని కోరిన పోలీసులు, పరామర్శకు వచ్చినప్పటికీ తమ సూచనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, దాని బాధ్యత అల్లు అర్జున్‌పై ఉండవచ్చని హెచ్చరించారు. అలాగే, ఆసుపత్రికి రాకను గోప్యంగా ఉంచాలని పోలీసులు సూచించారు. ఇది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి అవసరమని తెలిపారు. ఆసుపత్రికి వచ్చినప్పుడు తిరిగి వెళ్లే వరకు కూడా పూర్తి ఎస్కార్ట్‌ను అందిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. Also Read : 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు