Sandeep Reddy Vanga: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే సందీప్ బాలీవుడ్ లో తెరకెక్కించిన మొదటి సినిమా 'కబీర్ సింగ్' విడుదలై ఆరు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన షేర్ చేసిన పోస్ట్ చర్చకు దారితీసింది.
Also Read: Subhashree: బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ సంగీత్ లో సింగర్ భోలే రచ్చ రచ్చ! వీడియో వైరల్
దీపికాకు కౌంటర్?
సందీప్ పోస్టులో హీరో షాహిద్ ఫొటో లేకుండా.. కేవలం కియారా అద్వానీ ఉన్న పోస్టర్ మాత్రమే షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీపికాతో వివాదం నేపథ్యంలో ఆమెకు కౌంటర్ గా.. కియారాను ప్రశంసిస్తూ ఈ విధంగా చేసి ఉంటారని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ 'స్పిరిట్ ' విషయంలో సందీప్, దీపికా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు దీపికా స్థానంలో 'యానిమల్' బ్యూటీ త్రిప్తిని ఎంపిక చేసినట్లు సమాచారం.
Thanks for the love 🙏
— Sandeep Reddy Vanga (@imvangasandeep) June 21, 2025
6 years for Kabir 💚@shahidkapoor@advani_kiara@TSeries@ashwinvarde@dop_santha@rameemusic@VishalMMishra@Mithoon11@SachetParampara@AkhilNasha@Irshad_kamil@KuttiKalampic.twitter.com/lYDejOfCko
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!