Samantha: గత రెండేళ్లుగా సినిమాల్లో కనిపించకపోయినా.. ఓటీటీ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది సమంత. అయితే ఓటీటీల్లోనూ ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా సామ్ ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. 'సిటాడెల్: హానీ- బన్నీ సీరీస్ లో సమంత అద్భుత నటనకు ఓ మీడియా సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో సమంత- వరుణ్ ధావన్ కలిసి నటించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన 'సిటాడెల్' మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
వారందరికీ అంకితం
ఈ అవార్డును అందుకోవడంపై సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నిజానికి ఈ సీరీస్ పూర్తి చేయడమే నాకు అవార్డు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సీరీస్ పూర్తిచేశాను. నన్ను నమ్మిన, నన్ను ఇష్టపడే వారందరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నాను. దర్శకుడు రాజ్ అండ్ డీకే, నా కో యాక్టర్ వరుణ్ ధావన్ కారణంగానే సిటాడెల్ పూర్తి చేయగలిగాను. ఈ సీరీస్ పూర్తి చేయడానికి ఎంతో ఓపికతో వ్యవహరించారు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు" అని తెలిపింది.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన లావెండర్ శారీలో అందంగా ముస్తాబైంది సామ్. సాంప్రదాయ కట్టుకు అధునాతనను జోడించి మరోసారి ఫ్యాషన్ ట్రెండ్‌సెట్టర్ అని నిరూపించుకుంది. స్మోకీ కళ్ళు, పింక్ లిప్ స్టిక్, అలాగే ఆమె కాంతిని పెంచే మెరిసే హైలైటర్‌తో తళుక్కుమంది. స్టైలిష్ చీరలో సమంత లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
telugu-news | latest-news | cinema-news