samantha : ఫిక్స్.. అతనితోనే సమంత డేటింగ్.. హింట్ ఇచ్చేసిందిగా!

మరోసారి సామ్ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పికిల్‌బాల్ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాజ్ చేతిని చాలా క్లోజ్గా పట్టుకుని ఉన్నట్టుగా ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

author-image
By Krishna
New Update
Samantha Confirms Dating Raj Nidimoru?

Samantha, Raj Nidimoru

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లుగా గత కొంతకాలంంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా తమ పని తాము చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.  పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్న సమంత టోర్నీ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాజ్ తో కలిసి సందడి చేశారు. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో సామ్ అతని చేతిని చాలా క్లోజ్ గా పట్టుకుని ఉన్నట్టుగా కనిపించడంతో  డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా..  ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. 

ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో

 ఇంజనీరింగ్ స్టడీ చేసిన  రాజ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.  అక్కడ తన ఫ్రెండ్  కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్‌ ఫిల్స్మ్‌ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదటగా షాదీ అనే షార్ట్‌ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో బాగా ఫేమస్ అయ్యారు.   ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ నుంచి రాజ్‌, సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఇటీవల వీరి కాంబోలో వచ్చిన  సిటాడెల్‌ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.  ఇక సమంత విషయానికి వస్తే గతంలో ఆమె నటుడు నాగ చైతన్యను 2017లో ప్రేమవివాహం చేసుకున్నారు, అయితే ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత  నాగ చైతన్య హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు.

Also Read :  U19 T20 World cup: అండర్ 19 వరల్డ్‌ కప్‌ మనదే.. అదరగొట్టిన గొంగడి త్రిష!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు