Samantha కొత్త చర్చకు తెరలేపిన సమంత 'లైక్'.. విడాకులకు అసలు కారణం అదేనా?

సమంత భార్యాభర్తల భర్తల బంధం గురించి పెట్టిన ఓ పోస్టును లైక్ చేయడం వైరల్ గా మారింది. భార్యలు అనారోగ్యానికి గురైతే.. భర్తలు వారిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారని ఒక సర్వేలో తేలినట్లు ఆ పోస్టులో ఉంది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

New Update

Samantha: నటి సమంత సక్సెస్ వెర్స్ అనే ఇన్ స్టా భార్యాభర్తల భర్తల బంధం గురించి పెట్టిన ఓ పోస్టును లైక్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే..? భార్యలు అనారోగ్యానికి గురైతే.. భర్తలు వారిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారని ఒక సర్వేలో తేలిందంట. భార్యల ప్రాణాంతక వ్యాధి కారణంగా 21 శాతం మంది భర్తలు విడిపోతున్నారట. అదే సమయంలో భర్తల అనారోగ్యం కారణంగా విడిపోయే భార్యలు కేవలం 2.9 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది.

కొత్త చర్చకు సమంత 'లైక్' 

భర్తలు అనారోగ్యం పాలైనా..  వారితో కలిసి జీవించాలనుకునే భార్యలే ఎక్కువ ఉన్నట్లు సర్వేలో తేలిందని పోస్ట్ లో పెట్టారు. అలాగే దీనిపై చర్చ కూడా జరిపారు. ఈ పోస్టును సమంత లైక్ చేసింది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. చై- సామ్ విడిపోవడానికి ఆమె ఆరోగ్య సమస్యలే కారణమా అని చర్చించుకుంటున్నారు. కానీ సామ్ మాయోసైటీస్ బారిన పడకముందే నాగచైతన్యతో విడాకులు తీసుకున్నారు. కావున అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. అసలు చై- సామ్ విడిపోవడానికి ప్రధాన కారణమేంటి? అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఏదేమైనా సమంత ఈ పోస్టును లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ 

ఇదిలా ఉంటే తాజాగా సామ్- డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో కలిసి తిరుమల శ్రీవారి దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ వీరిద్దరూ ప్రత్యేక పూజలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తిరుమలలో సాంప్రదాయ వస్త్రాలంకారణలో  సమంత- రాజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పలు సందర్భాల్లో సమంత రాజ్ తో కలిసి కనిపించారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు మరోసారి తిరుమలలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే తిరుమలను దర్శించుకున్నారా? అని అనుకుంటున్నారు. అయితే సమంత మాత్రం తాను నిర్మించిన తొలి చిత్ర  'శుభం' విడుదల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. 

telugu-news | cinema-news | telugu-cinema-news | samantha - raj nidimoru | samantha naga chaitanya divorce

#telugu-news #telugu-cinema-news #cinema-news #samantha naga chaitanya divorce #samantha - raj nidimoru
Advertisment
Advertisment
తాజా కథనాలు