Salaar Ravi Basrur: 'సలార్' BGMs కి హాలీవుడ్ మేకర్స్ ఫిదా..! రవి బస్రూర్ కామెంట్స్ వైరల్ ..

'సలార్' విజయంతో రవి బస్రూర్‌కు అమెరికా నుంచి మూడు-నాలుగు నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చాయట. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో పని చేస్తున్నారు. ఆయన మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరడం ఇప్పుడు విశేషంగా మారింది.

New Update
Salaar Ravi Basrur

Salaar

Salaar Ravi Basrur: సౌత్ ఇండియన్ సినిమా సంగీత దర్శకులలో రవి బస్రూర్ పేరు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తోంది. గతంలో 'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, తాజాగా 'సలార్' సినిమాతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయనకి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

రవి బస్రూర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “సలార్‌కి మేము అంతర్జాతీయ ప్రమాణాలు దృష్టిలో పెట్టుకొని మ్యూజిక్ కంపోజ్ చేశాం. ఫలితంగా అమెరికాలోని మూడు నుంచి నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి మాకు ఆఫర్లు వచ్చాయి. ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం” అని వెల్లడించారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సలార్ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మొదట కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమా ఓటిటీలో విడుదలైన తరువాత, ఎక్కువ మంది ఆ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ రిపీటెడ్ గా చూశారు. రవి బస్రూర్ మ్యూజిక్(Salaar Bgms) చూసే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ జనాలకి నచ్చేయడం విశేషం.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!

రవి బస్రూర్ కెరీర్‌లో మైలురాయిలుగా నిలిచిన సినిమాల్లో కేజీఎఫ్ సిరీస్, ఉగ్రం, సలార్ ప్రధానంగా నిలిచాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ అభిమానులలో క్రేజ్ ఉంది. ఆయన మ్యూజిక్ ఆ సినిమాలకి ప్రత్యేక బలాన్ని ఇచ్చింది అనే చెప్పాలి.

Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!

ప్రస్తుతం రవి బస్రూర్ మరో పెద్ద ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ అనే టైటిల్‌తో పిలుస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మూడు నుంచి నాలుగు మ్యూజిక్ వెర్షన్లు సిద్ధం చేశానని బస్రూర్ వెల్లడించారు.

Also Read: దుమ్మురేపుతున్న 'OG' సెన్సార్ టాక్.. ఊచకోతేనట..!

ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆయన మ్యూజిక్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో ఆయన చూపిన క్రీయేటివ్ టచ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమాలో కూడా బస్రూర్ మ్యూజిక్ ఓ స్పెషల్ ఎలిమెంట్‌గా నిలవడం ఖాయం.

రవి బస్రూర్ మ్యూజిక్ జానర్లో తనదైన ముద్ర వేసుకుని, ఇప్పుడు అంతర్జాతీయంగా అడుగుపెడుతున్నారు. ఒక ప్రాంతీయ సంగీత దర్శకుడిగా మొదలై, ఇప్పుడు గ్లోబల్ ప్రాజెక్ట్స్‌కి ఛాన్స్ రావడం అంటేనే ఆయన ప్రతిభ ఎంతగా మెప్పించిందో అర్థమవుతుంది.

భవిషత్తులో రవి బస్రూర్ నుండి ఇంటర్నేషనల్ సినిమాల్లో మ్యూజిక్ వినే అవకాశం ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, త్వరలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆయన పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు