/rtv/media/media_files/2025/05/21/7dbY14Ry1TpmaSLXaxqo.jpg)
నటి సయామి ఖేర్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారని బాలీవుడ్ బబుల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక తెలుగు సినిమాలోని పాత్ర కోసం వారి ఏజెంట్ తనకు ఫోన్ చేసిందని, అవకాశం కోసం కాంప్రమైజ్ అవ్వాలని చెప్పిందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఓ మహిళ అయి ఉండీ కూడా ఆమె తనని ఇలా అడగడం చూసి షాక్ అయ్యానని అన్నారు.
🚨 🚨 #BreakingNews Saiyami Kher says she was asked to get lip fillers, nose job: ‘Everyone ends up looking like a factory-made product’ https://t.co/UaZ5VQGl1I
— Instant News ™ (@InstaBharat) May 21, 2025
Saiyami Kher revealed that she would never want to undergo any cosmetic surgery, stating she has no problems with h…
ఆ మూవీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశా
అలాంటి ఆఫర్ తనకు అవసరం లేదని మొహం మీదే చెప్పేసి ఆ మూవీ ఆఫర్‌ని రిజెక్ట్ చేశానని నటి సయామి ఖేర్ వెల్లడించింది. అయితే అ తెలుగు డైరెక్టర్ ఎవరూ అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. కాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రేయ్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది సయామి ఖేర్.
తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో
ఆ తరువాత నాగార్జునతో వైల్డ్ డాగ్, ఆనంద్ దేవరకొండ హైవే చిత్రాలలో నటించింది. ఆమె నటించిన చిత్రాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేసుకుంటోంది. ఇటీవలే ఆమె సన్నీ డియోల్ `జాట్`లో ఎస్‌ఐ విజయ లక్ష్మిగా కీలక పాత్రలో నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణదీప్ హుడా, రెజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సయామి దివంగత నటి ఉషా కిరణ్ మనవరాలు