Saiyaara OTT: ఓటీటీలోకి బాలీవుడ్‌ సెన్సేషన్ ‘సైయారా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘సైయారా’ సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ సినిమా ₹580 కోట్లు వసూలు చేసి, ఓవర్సీస్‌లో రికార్డులు సృష్టించింది. తెలుగు డబ్ లేకపోయినా, హిందీ వెర్షన్‌ అందుబాటులో ఉంది.

New Update
Saiyaara OTT

Saiyaara OTT

Saiyaara OTT: ఈ ఏడాది బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం ‘సైయారా’ (Saiyaara). మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా, విడుదలైనప్పటి నుండి సూపర్ హిట్ టాక్ సొంత చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో(Saiyaara on Netflix) స్ట్రీమింగ్‌కి రానుంది.

Also Read: 'రాజా సాబ్' ప్రొడ్యూసర్ క్రేజీ అప్‌డేట్.. రెబల్‌ ఫ్యాన్స్‌ కి పండగే..!

డెబ్యూట్ హీరో హీరోయిన్లతో భారీ విజయం.. 

ఈ సినిమాతో హీరో అహాన్ పాండే (Ahaan Panday), హీరోయిన్ అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. వీరిద్దరూ పోషించిన క్రిష్, వాణి పాత్రలు యూత్‌ కు బాగా కనెక్ట్ అయ్యాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. స్క్రీన్‌ప్లే, యాక్టింగ్ ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి. రిలీజ్ టైమ్‌లో పెద్దగా హైప్ లేకపోయినా, మౌత్ టాక్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

Also Read: ఓటీటీలోకి 'కూలీ' ఎంట్రీ.. తలైవా వైబ్ అస్సలు మిస్సవకండి!

కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, పెద్ద సినిమాల వసూళ్లను తలదన్ని బాలీవుడ్‌లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రంగా ‘సైయారా’ ఈ ఏడాది రికార్డు సెట్ చేసింది. గతంలో విడుదలైన హిట్ మూవీ ‘ఛావా’ రికార్డును కూడా బ్రేక్ చేసింది.

Also Read: ఆ రొమాన్స్ ఏంటి బ్రో..! సిద్ధూ 'తెలుసు కదా' టీజర్ వచ్చేసింది

టైటిల్ సాంగ్ వరల్డ్‌వైడ్ హిట్

‘సైయారా’లోని పాటలు, ముఖ్యంగా టైటిల్ ట్రాక్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాట అంతర్జాతీయంగా కూడా పెద్ద హిట్‌గా నిలిచింది. పాటలు, bgm సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ, ఓటీటీ రిలీజ్ విషయంలో తెలుగు డబ్ వెర్షన్‌ విడుదలపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రాబోతుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించినా, భవిష్యత్తులో డబ్ వెర్షన్ వచ్చే అవకాశం మాత్రం ఉంది.

Also Read: 'రాజా సాబ్'పై SKN సాలిడ్ అప్‌డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!

సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 

‘సైయారా’ సినిమా సెప్టెంబర్ 12, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో 190 దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్, 5.1 సౌండ్ సిస్టమ్‌తో సినిమాను హై క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది పండుగే అని చెప్పొచ్చు.

Advertisment
తాజా కథనాలు