Saif Ali Khan: సైఫ్ పై దాడి.. నిందితుడి మరో సంచలన వీడియో

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు ఓ మొబైల్ షాప్ లో గుర్తించారు. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. అందులో నిందితుడు దాడి తర్వాత ఓ మొబైల్ షాప్ లో ఇయర్ ఫోన్స్ కొన్నాడు. ఆ సమయంలో అతను బ్లూ షర్ట్ ధరించినట్లు కనిపిస్తోంది.

New Update
saif ali khan accused

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. నిందితుడి కోసం పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముంబై అంతా జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిందితుడ్ని ఓ మొబైల్ షాప్ లో గుర్తించి అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. 

అందులో నిందితుడు సైఫ్ పై దాడి చేసిన సుమారు ఆరు గంటల తర్వాత  ఉందయం 9 గంటల ప్రాంతంలో ఓ మొబైల్ షాప్ లో ఇయర్ ఫోన్స్ కొన్నాడు. ఆ సమయంలో అతను బ్లూ షర్ట్ ధరించినట్లు కనిపిస్తోంది. నిన్న ఆ షాప్ కు వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ ను కలెక్ట్ చేసుకున్న ముంబై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు