Actor Sai Kumar: డైలాగ్ కింగ్ సాయి కుమార్ కి 'కొమరం భీమ్' అవార్డు

50 ఏళ్ళ సినీ కెరీర్ లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సాయి కుమార్ సినీ రంగానికి చేసిన సేవలకు గానూ అరుదైన గౌరవం దక్కింది. సాయి కుమార్ ప్రతిష్టాత్మకమైన 'కొమరం భీమ్' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సెలక్షన్‌ చైర్మన్‌ సి.పార్థసారధి ప్రకటించారు.

New Update
komaram Bheem national award to sai kumar

komaram Bheem national award to sai kumar

Actor Sai Kumar: డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటుడిగా అయన ప్రస్థానం మొదలుపెట్టి యాభై ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనను ప్రతిష్టాత్మకమైన  'కొమరం భీమ్' పురస్కారం వరించింది.  అయితే ప్రతీ ఏడాది సినీ రంగానికి చెందిక ఒకరికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అలా  2024 సంవత్సరానికి గాను సాయికుమార్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సి.పార్థసారధి ప్రకటించారు. గతంలో గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, అల్లాణి శ్రీధర్‌, డా.రాజేంద్రప్రసాద్‌, గూడ అంజయ్యలకు 'కొమరం భీమ్' పురష్కారాన్ని అందుకున్నారు. 

ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల డేటింగ్‌.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?

అరుదైన గౌరవం

50 ఏళ్ళ సినీ కెరీర్ లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సాయి కుమార్  సినీ రంగానికి చేసినసేవలకు గానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అవార్డుతో తో పాటు రూ.51,000ల నగదు బహుమతిని కూడా అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భారత కల్చరల్‌ అకాడమి,  ఆదివాసి సాంస్కృతిక పరిషత్‌ సంయుక్త, ఓం సాయి తేజ ఆర్ట్స్ సంస్థలు  గత 12 ఏళ్లుగా ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 23న కొమరం భీమ్ జిల్లా  అసిఫాబాద్‌లోని ప్రమీలా గార్డెన్స్‌లో వేదికగా  పురస్కార మహోత్సవం జరగనుంది.  రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

సాయి కుమార్  తెలుగు సినిమా చరిత్రలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.   కనిపించే మూడు సింహాలు చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతిరూపాలైతే..  కనిపించని నాలుగో సింహమేరా పోలీస్,  అవ‌స‌రాల కోసం దారులు తొక్కే పాత్రలే త‌ప్ప, హీరోలు, విల‌న్‌లు లేరన్నా .. ఇలాంటి  అనేక సూపర్ హిట్ డైలాగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల నోటా వినిపిస్తూనే ఉంటాయి. డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోగా, విలన్ గా, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఆయన కెరీర్‌లో అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు