/rtv/media/media_files/nabha-f.jpg)
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీగా పాపులరైన నభా... ఆ తర్వాత డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అవి ఆమెకు ఊహించని సక్సెస్ అందించలేకపోయాయి. Image Credits: Nabha Natesh/ Instagram
/rtv/media/media_files/nabha-d.jpg)
ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ప్రియదర్శి సరసన 'డార్లింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దురదృష్టవశాత్తు ఈ మూవీ నభాకు అంతగా కలిసిరాలేదు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ఎంతో సరిపెట్టుకుంది. Image Credits: Nabha Natesh/ Instagram
/rtv/media/media_files/nabha-e.jpg)
అయితే కెరీర్ లో వరుస పరాజయాలు ఎదురైనా.. ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి నభాకు. ఈ మధ్య కాలంలో తన ఖాతాలో ఒక్క హిట్టు లేకపోయినా.. కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్న ఆమె సామర్థ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. Image Credits: Nabha Natesh/ Instagram
/rtv/media/media_files/nabha-b.jpg)
ప్రస్తుతం నభా తెలుగులో నిఖిల్ సరసన పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న స్వయంభు సినిమాలో నటిస్తూనే.. తాజాగా మరో ఆఫర్ కొట్టేసింది. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా తెరకెక్కనున్న ‘నాగబంధనం’ సినిమాలో విరాట్ కర్ణ జంటగా నభా నటేష్ కనిపించనుంది. Image Credits: Nabha Natesh/ Instagram
/rtv/media/media_files/nabha-a.jpg)
ఈ చిత్రాన్ని ఇటీవలే పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సినిమాకు క్లాప్ కొట్టారు. నటి ఐశ్వర్యమీనన్ కూడా ఈ మూవీలో మరో కీలక పాత్రలో కనిపించనుంది. Image Credits: Nabha Natesh/ Instagram