Cannes 2025: మెడలో మోదీ ఫొటోలతో నెక్లెస్‌.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటి రుచి గజ్జర్!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నటి రుచి గజ్జర్ ప్రధాని మోదీ ఫొటోలతో కూడిన నెక్లెస్‌ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మోదీపై గౌరవంతో తాను కేన్స్ వేదికపై ఆ నెక్లెస్‌ ధరించినట్లు తెలిపారు రుచి.

New Update
Ruchi Gujjar turns head at cannes with modi necklace

Ruchi Gujjar turns head at cannes with modi necklace

Ruchi Gujjar: ప్రపంచవ్యాప్తంగా  సినీ రంగం ప్రతిష్టాత్మకంగా జరుపుకునే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్  2025 వేడుక  ఫ్రాన్స్ లో అట్టహాసంగా జరుగుతోంది. ఇప్పటికే వివిధ దేశాల తారలు కేన్స్ రెడ్ కార్పెట్ అబ్బురపరిచే వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. తాజాగా మరో నటి రుచి గజ్జర్ ప్రధాని మోడీ ఫొటోలతొ కూడిన నెక్లెస్‌  ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Ruchi gujjar photos
Ruchi gujjar photos

 

 మోదీ ఫొటోలతొ నెక్లెస్‌

తొలిసారి కేన్స్ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టిన రుచి మోదీ మొహంతో ఉన్న పెండెంట్లను నెక్లెస్‌ గా ధరించి  ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రుచి అవుట్ ఫిట్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీపై గౌరవంతో తాను కేన్స్ వేదికపై ఆ నేక్ లెస్ ధరించినట్లు తెలిపారు రుచి.  "ఈ నెక్లెస్  కేవలం ఆభరణం కాదు, ఇది భారతదేశ గర్వాన్ని, శక్తిని, విజన్‌ను చూపుతుంది" అని  చెప్పింది.

రాజస్తానీ శైలిలో

రుచి ధరించిన గోల్డ్ కలర్ లెహంగా, దుప్పట్టా, ఆభరణాలు రాజస్థానీ శైలిని ప్రతిభింభించేలా ఉన్నాయి.  ఈ అవుట్ ఫిట్ ను రూపా శర్మా డిజైన్ చేశారు. గోటా పట్టి, మిర్రర్ వర్క్ హస్తకళలతో  కూడిన లెగంగాలో రుచి అందంగా ముస్తాబైంది. ఆమె ధరించిన బంధనీ దుపట్టా ను డిజైనర్ రామ్ రూపొందించారు. అందులో జర్దోజీ ఎంబ్రాయిడరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Ruchi gujjar at 78th cannes film festival
Ruchi gujjar at 78th cannes film festival

 

ఎవరు ఈ రుచి గుజ్జర్?

రుచి గుజ్జర్  జయపూర్‌లోని మహారాణి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది.  2023లో మిస్ హర్యానా  టైటిల్ గెలుచుకుంది. "Jab Tu Meri Na Rahi",  "Heli Mein Chor" వంటి మ్యూజిక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. 

78th Cannes Film Festival | latest-news | telugu-news | telugu-cinema-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు