Ritika Nayak: టాలీవుడ్‌కు లేడీ లక్కుగా మారుతున్న 'వైబ్ బేబీ'..

టాలీవుడ్‌లో రితికా నాయక్ ఫుల్ ఫాం లో ఉంది. ఆమె నటించిన మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్‌లు అయ్యాయి. మిరాయ్‌తో హ్యాట్రిక్ కొట్టింది. ఇప్పుడు వరుణ్ తేజ్, ఆనంద్ దేవరకొండ సినిమాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరికి రితికా లేడీ లక్కుగా మారుతుందా? లేదో చూడాలి.

New Update
Ritika Nayak

Ritika Nayak

Ritika Nayak: టాలీవుడ్‌లో ప్రస్తుతం యూత్‌ను మంత్రముగ్ధులను చేస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి రితికా నాయక్ గురించి మాట్లాడుకోవాలి. ‘వైబ్ బేబీ’గా పేరు తెచ్చుకున్న ఆమె, తన క్యూట్ లుక్స్, నాచురల్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. రితికా నటించిన మొదటి మూడు సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలవడం విశేషం. ఒక్కో సినిమా మరో దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ 

రితికా, విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాలో కీలక పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇందులో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మంచి లాంచింగ్ అయింది.

అంతేకాకుండా, నాని, మృణాల్ ఠాకూర్ నటించిన 'హాయ్ నాన్న' సినిమాలో, రితికా నానికి కూతురిగా భావోద్వేగంతో నిండిన పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో గుర్తింపు తీసుకొచ్చింది.

Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?

మిరాయ్‌తో హ్యాట్రిక్ హిట్

ఇటీవల విడుదలైన 'మిరాయ్' సినిమాతో రితికా(Mirai Heroine) హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, రితికాకు ఇండస్ట్రీలో బెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. విదేశాల్లో కూడా ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు క్రాస్ చేయడం విశేషం.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

ప్రస్తుతం రితికా చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆనంద్ దేవరకొండతో నటిస్తున్న 'డ్యూయెట్' అనే చిత్రం. ఈ సినిమా సుమారు ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైంది. కానీ తాజాగా దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

ఇంకో సినిమా మెగా హీరో వరుణ్ తేజ్ సరసన చేస్తున్న ప్రాజెక్ట్. ఇది ఇండో-కొరియన్ హారర్ డ్రామాగా రూపొందుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. ‘ఎఫ్3’ తర్వాత వరుణ్ తేజ్‌కు సరైన హిట్ రాలేదు. ఇటీవలే తండ్రిగా మారిన ఈ హీరోకు మంచి హిట్ అవసరం. అలాగే ఆనంద్ దేవరకొండ కూడా ‘బేబి’ తర్వాత ‘గంగంగణేశా’తో నిరాశపరిచాడు. ఆయనకూ మరో హిట్ అవసరం.

Also Read: షాకింగ్.. అనారోగ్యంతో టాప్ కమెడియన్ కన్నుమూత..

లేడీ లక్క్ అవుతుందా?

ఇప్పటి వరకూ రితికా నాయక్ చేతికి వచ్చిన అవకాశాలన్నీ ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఆమె నటిస్తున్న రెండు సినిమాలు కూడా మంచి హైప్‌లో ఉన్నాయి. దీంతో యూత్ ఐకాన్‌గా ఎదుగుతున్న ఈ భామ, వరుణ్ తేజ్, ఆనంద్ దేవరకొండలకు లేడీ లక్క్ అవుతుందా? లేదో చూడాలి.

Advertisment
తాజా కథనాలు