తెలీదు, గుర్తులేదు.. RTV లైవ్ లో RGV సంచలనం

ఆర్జీవీ ఎక్కడ? ఏపీ పోలీసుల నోటీసులకు భయపడి పారిపోయాడా? గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. ఈ ప్రశ్నలకు RTV స్టూడియోకి వచ్చి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు RGV. ఆయన ఏమన్నారో ఈ ఆర్టికల్ లో చూడండి.

New Update

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న కారణంతో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. 

దీనిపై ఆర్జీవీ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా ఆర్టీవి ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు చట్టం అంటే గౌరవం ఉందని, తాను ఎక్కడికి వెళ్లి దాక్కోలేదని, తన డెన్  లోనే ఉన్నానని చెప్పారు.

నాకు తెలీదు, గుర్తు లేదు..

చంద్రబాబు, పవన్, లోకేష్ లను కించపరుస్తూ పెట్టిన ట్వీట్ గురించి మాట్లాడుతూ.." నేను సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ అది. అది పెట్టినట్లు కూడా నాకు గుర్తు లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ ను నేనే కాదు నా ఆఫీస్ వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తారు. నేను రోజుకు 10 ట్వీట్లు పెడుతుంటా. అది దేనికి సంబంధించి అయినా కావొచ్చు. అందులో సంవత్సరం క్రితం అంటే కొన్ని వేల ట్వీట్లు ఉంటాయి. ఇందులో ఎప్పుడేం పెట్టాననేది నాకెలా గుర్తు ఉంటుంది. నాకు తెలీదు. సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివ్ ట్వీట్స్ రోజుకు వేలల్లో వస్తుంటాయి. అసలు సోషల్ మీడియా ఉన్నదే అందుకు అని అన్నారు.

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

మూడో వ్యక్తి ఎలా కంప్లైంట్ చేస్తాడు..

" వన్ ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ట్వీట్ గురించి ఎవడూ మాట్లాడలేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను పక్కన పెడితే.. అప్పుడు కనీసం మీడియా అయినా నేను పెట్టిన ట్వీట్ పై నోటిస్ చేసిందా? అని ప్రశ్నించారు. నేను ఒక మనిషిని అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు నామీద కంప్లైంట్ చేయొచ్చు. కానీ సంబంధం లేని మూడో వ్యక్తి ఎలా కంప్లైంట్ చేస్తాడు?.." అని అన్నారు.

దాని వెనక ఉద్దేశ్యం అదే..

మార్ఫింగ్ ఫొటోలపై మాట్లాడుతూ.." ఒకరి మీద ఒక క్రిమినల్ యాస్పెక్ట్ లేదా ఎదో ఒకటి చేయడానికి ఇది నిజం అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అది నేరం అవుతుంది. పవన్, చంద్రబాబు, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి నేను పెట్టలేదు. నాకు తెలియదు. ఒకవేళ అలా పెట్టినా కూడా ఏమాత్రం తప్పులేదు. దాని వెనక ఉద్దేశ్యం నవ్వించడానికే తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. ఆ ట్వీట్ ఎలా డిలీట్ అయిందో కూడా నాకు తెలీదు. న ట్విట్టర్ ను నా ఆఫీస్ కూడా హ్యాండిల్ చేస్తారని అన్నారు.

 Also Read : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నాకు ప్రజా సేవ మీద ఆసక్తి లేదు..

చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్తే బాగుటుందని కామెంట్స్ పై RGV రియాక్ట్ అవుతూ.." నాకు ప్రజా సేవ మీద ఇంట్రెస్ట్ లేదు. నా సేవే నేను చేసుకుంటా. నా లైఫ్ లో ఎప్పుడూ నేను ఓటు వేయలేదని చెప్పారు. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకుండానే వాటిపై సినిమాలో ఎలా తీశారని అడిగితే..' నేను అండర్ వరల్డ్ మీద సినిమా తీస్తే నేను గ్యాంగ్ స్టర్ అయిపోతానా? పోలీసుల మీద సినిమా తీసే పోలీస్ అయ్యే ఉద్దేశ్యం ఉన్నట్టా?  ఆ పర్టిక్యులర్ టైం లో నాకు ఏదైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో దాని మీదే సినిమా తీస్తా.." అని చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు