/rtv/media/media_files/2025/07/11/renu-desai-2025-07-11-17-34-33.jpg)
renu desai
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచు ఏదో ఒక విషయం గురించి వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కూతురు ఆద్యతో కలిసి ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు. ఈ సెల్ఫీ కింద ఆమె రాసిన క్యాప్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. "సర్జరీ తర్వాత నా క్యూటీస్‌తో డిన్నర్‌కు వెళ్లాను'' అని రాసుకొచ్చారు. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అసలు ఆమెకు ఏం సర్జరీ జరిగింది? ఆమె ఆరోగ్యానికి ఏమైంది అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీని గురించి రేణు దేశాయ్ ఏమైనా స్పందిస్తారా? లేదా అనేది చూడాలి. ఈ ఫొటోలో ఆద్య క్రీమ్ రంగు దుస్తుల్లో, రేణు నలుపు-నీలం చెక్స్ షర్ట్‌లో కనిపించారు.
Also Read:Naga Babu Re Entry: 12 ఏళ్ల తర్వాత నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. 'జబర్దస్త్' ప్రోమో చూశారా
2012లో విడాకులు
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆద్య, అకీరా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2012లో వ్యక్తిగత కారణాల చేత విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైనా రేణు దేశాయ్.. తల్లి పాత్రను పోషిస్తూ తన పూర్తి సమయాన్ని పిల్లకే కేటాయించారు.
రీ ఎంట్రీ
రీసెంట్ గా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. హేమలత లవణం అనే పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమా ప్లాప్ అవడంతో మళ్ళీ ఆమె సినిమాలపై పెద్ద ఆసక్తి చూపడం లేదు. సినిమాల్లో కనిపించకపోయినా అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంటారు.
Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!