/rtv/media/media_files/2024/10/30/zwMB29GKF0fXsIv8TfAu.jpg)
ఇటీవల 'మిస్టర్ బచ్చన్' మూవీతో ప్లాప్ అందుకున్న రవితేజ తన తదుపరి సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసొచ్చిన ఫార్ములాతో రాబోతున్నాడు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'RT75'. 'సామజవరగమన' లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి రచయితగా పని చేసిన భాను బోగవరపు ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు 'మాస్ జాతర' అనే టైటిల్ ఖరారు చేశారు. 'ఇడియట్' సినిమాలోని 'మనదే ఇదంతా..' అనే డైలాగ్ ను ఈ మూవీకి ట్యాగ్‌లైన్ గా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Get ready for a Re-Sounding Entertainer 💥
— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024
Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇
BLASTING the screens with highly
MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣
Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు నిర్మాత క్షమాపణలు.. 'NBK109' టైటిల్ అప్డేట్ లేదా?
వచ్చే ఏడాది సమ్మర్లో..
చేతిలో గంట పట్టుకుని, బొడ్డులో తుపాకీతో కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయంగా అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. ఇదే పోస్టర్ లో రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల మరోసారి రవితేజతో జోడి కడుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Also Read : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన తారక్