BIGG BOSS 9 Promo: ఈసారి బిగ్ బాసే మారిపోయాడు.. ఫుల్ ట్విస్టులతో బిగ్ బాస్ కొత్త ప్రోమో !

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కొత్త ప్రోమో విడుదలైంది. వెన్నెల కిషోర్- నాగార్జున సంభాషణలతో సాగిన ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ‘ఈసారి డబుల్‌ హౌస్‌.. డబుల్‌ డోస్‌’ అంటూ సీజన్ పై ఆసక్తిని పెంచారు నాగార్జున.

New Update

BIGG BOSS 9 Promo: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో .. మరో కొత్త సీజన్ తో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీజన్ 9 కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు మేకర్స్. ఇప్పటికే పలు ప్రోమోలను విడుదల చేయగా.. తాజాగా మరో కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. 

కొత్త ప్రోమో 

వెన్నెల కిషోర్- నాగార్జున సంభాషణలతో ఈ ప్రోమో  అమాంతం ఆకట్టుకుంది.  ప్రోమోలో "ఈసారి చదరంగం కాదు.. రణరంగమే!" అనే ట్యాగ్ లైన్ తో  ఈసారి షో మరింత పోటీగా, రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తోంది.

 అలాగే  ‘ఈసారి డబుల్‌ హౌస్‌.. డబుల్‌ డోస్‌’ అంటూ సీజన్ పై ఆసక్తిని పెంచారు. దీని ప్రకారం సెలెబ్రెటీలు వెర్సెస్ సామాన్యులుగా సీజన్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  అంతేకాదు ప్రోమో చివరిలో ఈ సారి  'బిగ్ బాస్ నే మార్చేశా' అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున.  మొత్తానికి  గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ ఫార్మాట్ కొత్తగా, డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. 

అయితే ఈ సీజన్లో కామనర్స్ కి కూడా అవకాశం కల్పించారు బిగ్ బాస్ మేకర్స్. దీని కోసం ఇప్పటికే 'అగ్ని పరీక్ష' అనే  కాన్సెప్ట్ తో 40 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో నుంచి టాప్ 3 ని ఎంపిక చేయనున్నారు. మరి ఈ అగ్ని పరీక్షలో గెలిచి సెలెబ్రెటీ కంటెస్టెంట్ తో  సై అనబోయేదెవరో చూడాలి. 

బిగ్ బాస్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి..  కంటెస్టెంట్లు ఎవరనే దానిపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల జాబితాను  ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ.. సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. 

కంటెస్టెంట్ల లిస్ట్ 

  • అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష
  • నటీనటులు రాజ్ తరుణ్, సుమంత్ అశ్విన్
  • నటి రేఖ భోజ్, కల్పిక గణేష్
  • రీతూ చౌదరి, తేజస్విని
  • యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ
  • జబర్దస్త్ ఇమ్మానుయేల్ మరియు ఐశ్వర్య
  • సీరియల్ నటులు భావన లాస్య, అనాల సుష్మిత.

ఇదిలా ఉంటే గత ఆరు సీజన్లుగా కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్టుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు 9వ సీజన్ కి కూడా ఆయనే హోస్టుగా వ్యవహరించబోతున్నారు. ప్రోమోలో నాగార్జున స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సీజన్ కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిగ్ బాస్ హోస్టింగ్ బిజీ కాబోతున్నారు. నాగార్జున- రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' ఆగస్టు 14న విడుదల కానుంది.   ఇందులో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read:Kayadu Lohar: బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న డ్రాగన్ బ్యూటీ.. ఒక్క ఫొటో చూస్తే కుర్రాళ్లు ఫ్లాటే!

Advertisment
తాజా కథనాలు