Rashmika Mandanna : విజయ్ దేవరకొండను పెళ్లాడతా.. ఓపెన్ అయిన రష్మిక!

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్‌ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి... ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని..   2026లో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి

New Update
rashmika

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్‌ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి... ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని..   2026లో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. వీరి నిశ్చితార్థం గురించి ఈ జంట మాత్రం తమ సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా దీని గురించి మాట్లాడలేదు. అయితే, రష్మిక మాత్రం ఇటీవల అనేక చోట్ల తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ధరించి కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

నా కోసం యుద్ధం చేయాలి 

అయితే పెళ్లి పుకార్ల గురించి తాజాగా రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  'హానెస్ట్ టౌన్‌హాల్' క్యాంపస్ ఇంటరాక్షన్ సందర్భంగా, తన భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని రష్మికను అడగగా, ఆమె ఆసక్తికరంగా స్పందించారు. "నిజాయితీగా చెప్పాలంటే, నా భాగస్వామి లోతైన స్థాయిలో అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయి ఉండాలి. సాధారణ అర్థంలో కాదు. జీవితాన్ని తన సొంత దృక్కోణం నుండి అర్థం చేసుకునేవాడు, పరిస్థితులను ఎలా గ్రహిస్తాడు అనే దానిపై స్పష్టత ఉండాలి. నేను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండే, నిజాయితీగా మంచిగా ఉండే వ్యక్తిని కోరుకుంటున్నాను. నా కోసం లేదా నాతో కలిసి యుద్ధం చేయగలిగేవాడు కావాలి," అని రష్మిక తెలిపారు.

ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని పెళ్లి చేసుకుంటారో లేదా డేటింగ్ చేస్తారో అని అడగగా..  రష్మిక తాను నరుటో (అనిమే పాత్ర) తో డేటింగ్ చేస్తానని, విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున క్లాప్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రష్మిక ఇప్పటికే తన పెళ్లి కోసం సన్నాహాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌ను కూడా ఆమె వెల్లినట్లు సమాచారం. 

2018లో వచ్చిన గీత గోవిందం చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా కలిసి నటించారు.  ఈ జంట కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఒకే విధమైన ప్రదేశాల నుంచి ఫోటోలను షేర్ చేయడంతో వీరి రిలేషన్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. కాగా నటి రష్మిక మందన్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్  శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. 

Advertisment
తాజా కథనాలు