/rtv/media/media_files/2025/04/20/djI333czK4lsIhsc46vl.jpg)
anchor rashmi admitted to hospital
Anchor Rashmi: నటి రష్మీ గౌతమ్ బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఒకరిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ కనిపించే రష్మీ.. తాజాగా షేర్ చేసిన పోస్ట్ ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఇన్ స్టాలో తన ఆరోగ్య పరిస్థితి గురించి పంచుకుంది. ప్రస్తుతం తాను ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. కొద్దిరోజులుగా తన ఆరోగ్యం ఏమీ బాగోలేదని తెలిపింది. జనవరి నుంచి తీవ్రమైన రక్తస్రావంతో పాటు భుజాలు కూడా విపరీతంగా నొప్పి పుట్టించేవట. అసలు ఏ సమస్యను ముందుగా పరిష్కరించాలో అర్థం కాలేదు.
తీవ్రమైన రక్తస్రావం
సడెన్ గా హిమోగ్లోబిన్ 9కి పడిపోయింది. ఇక మార్చి 29 నుంచి శరీరం పూర్తిగా నీరసించి పోయింది. దీంతో ముందుగా ఒప్పుకున్న కమిట్మెంట్లను పూర్తి చేసుకొని వెంటనే ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. గత ఐదు రోజులుగా ఎమర్జెన్సీ సమయంలో నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలని పోస్ట్ పెట్టింది.
telugu-news | latest-news | anchor-rashmi | cinema-news