Ram Pothineni: ఫ్యాన్ వార్స్‌ ఆపాలి.. లేకపోతే..! హీరో రామ్ పోతినేని హాట్ కామెంట్స్..!

రామ్ పోతినేని హీరోగా నటించిన 'ఆంధ్ర కింగ్ తలూకా' నవంబర్ 28, 2025న విడుదల కానుంది. ఫ్యాన్ వార్స్‌పై రామ్ మాట్లాడుతూ, “అది మంచిది కాదు, అభిమానాన్ని సరైన దిశలో చూపాలి” అన్నారు. ఈ మూవీకి మహేశ్ బాబు. పి. దర్శకత్వం వహించారు.

New Update
Ram Pothineni

Ram Pothineni

Ram Pothineni: యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తలూకా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేశ్ బాబు. పి. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో యాంకర్ శ్రీముఖి రామ్‌ను సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ గురించి అడిగింది. దానికి రామ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Ram Pothineni About Fan Wars

రామ్ మాట్లాడుతూ – “ఫ్యాన్ వార్స్ అనేవి మంచివి కావు. అభిమానులు ఎవరి కోసం ప్రేమ చూపించినా, ఆ ప్రేమకు ఒక పరిమితి ఉండాలి. ఆ లైన్ దాటకూడదు. హీరోలపై ఉన్న అభిమానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆ ప్రేమను సరైన దిశలో చూపిస్తే చాలా మంచిది. కానీ దాన్ని నెగటివ్ వైపు తీసుకెళ్లడం సరైంది కాదు,” అని అన్నారు.

Also Read :  ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్‌.. త్వరలోనే పెళ్లి!

తన మాటలతో రామ్ అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు. స్టార్ హీరోలపై ఉన్న ఇష్టాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో తరచుగా జరుగుతున్న హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు తగ్గాలని రామ్ కోరుకున్నారు.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంగీతాన్ని విభేక్-మెర్విన్ అందిస్తున్నారు.

Also Read :  ‘రేసుగుర్రం నటుడిని చంపేస్తాం’.. గ్యాంగ్‌స్టర్ మాస్ వార్నింగ్..!

ఆంధ్ర కింగ్ తలూకా సినిమా నవంబర్ 28, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రామ్ కొత్త లుక్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మొత్తానికి, సినిమా విడుదలకు ముందు రామ్ చెప్పిన ఫ్యాన్ వార్స్‌పై అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన “అభిమాన హీరోపై ఉండే ప్రేమను సానుకూలంగా చూపించాలి” అనే సందేశం అభిమానులకు ఆలోచన కలిగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు