RGV విచారణలో బిగ్ ట్విస్ట్..?

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. నేడు ఈ కేసుపై విచారణకు రావాల్సిన RGV గైర్హాజరయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు.

rgv
New Update

Ram Gopal Varma :  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆర్జీవిపై టీడీపీ నేత, మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం కేసు పెట్టారు. 

ఇందులో భాగంగా 5 రోజుల క్రితం పోలీసులు HYDకు వచ్చి RGVకి నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. RGV ఇవాళ ఒంగోలు సీఐ కార్యాలయానికి రావాల్సి ఉంది. కానీ వర్మ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు.

Also Read : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!?

RGV కి ఏపీ హైకోర్టు షాక్..

కాగా ఈ కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థన చేయగా.. దానికి ఏపీ హైకోర్టు తిరస్కరించింది. అరెస్టుపై ఏమైనా ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఝలక్‌ ఇచ్చింది. దీంతో ఆర్జీవికి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది.

Also Read: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?

Also Read : అర్హ తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా.. 'అన్ స్టాపబుల్' న్యూ ప్రోమో వైరల్

Also Read: జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

#nellore #rgv #RGV Arrest #Case Filed Against Ram Gopal Varma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe