Buchi Babu: బుచ్చిబాబు కోసం ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. ఎంతో ప్రత్యేకమంటూ పోస్ట్

ఉపాసన- రామ్ చరణ్ దంపతులు బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుచ్చిబాబు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఈ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేమని తెలిపారు. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా పంపారు.

New Update

Buchi Babu: మార్చి 27న  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు రామ్ చరణ్ దంపతులు. అలాగే చరణ్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ గిఫ్ట్స్ పంపించారు. డైరెక్టర్ బుచ్చిబాబుకి కూడా ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బుచ్చిబాబు ఎక్స్ షేర్ షేర్ చేస్తూ.. కృతజ్ఞతలు తెలియజేశారు. ''ఎంతో ప్రియమైన రామ్ చరణ్, ఉపాసనకొనిదెల.. ఇది అద్భుతమైన బహుమతి. మీ ప్రేమ, మద్దతుకు ఎప్పటికీ  రుణపడి ఉంటాను'' అని ట్వీట్ చేశారు. హనుమాన్‌ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను గిఫ్ట్‌గా పంపారు చరణ్ దంపతులు. అలాగే ఒక నోట్ కూడా పంపారు. ‘మా  మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని నోట్ లో ఉంది. 

RC16 సినిమాతో బిజీ

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమాతో బిజీగా ఉన్నారు.  ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ ముగిసిన  తర్వాత  ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

cinema-news | latest-news | latest news telugu | Ram Charan | buchibabu-sana

ఇది కూడా చదవండి:Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఏంటి?

#Latest News #cinema-news #Ram Charan #Buchibabu Sana #latest news telugu
Advertisment
Advertisment
తాజా కథనాలు