Ram Charan: 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ 'పెద్ది' పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పాత్ర కోసం కఠినమైన వర్కౌట్లు, ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నాడు. ఫోటోలో చరణ్ కండలు తిరిగిన దేహం, రగ్గడ్ లుక్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నారు. గత సినిమా 'గేమ్ ఛేంజర్' లో స్టైలిష్ గా కనిపించిన రామ్ చరణ్.. 'పెద్ది' పూర్తి బిన్నంగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read:BIG BREAKING: పవన్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ పోలీసుల బిగ్ షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కీలక నిర్ణయం!
Bulking up for the next schedule of #Peddi ❤🔥
— Vriddhi Cinemas (@vriddhicinemas) July 21, 2025
Global Star @AlwaysRamCharan is undergoing a rigorous training and transforming himself for #Peddi 💥💥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
@NimmaShivanna#JanhviKapoor@BuchiBabuSana@arrahman@RathnaveluDop@artkolla… pic.twitter.com/LJ6fm8Sef0
స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన 'పెద్ది' ఫస్ట్ షాట్ వీడియోలో చరణ్ బ్యాట్ తో షాట్ కొట్టిన విధానం ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించింది. వృద్ధీ సినిమాస్' బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.