'గేమ్ ఛేంజర్' కొత్త పాట.. ప్రోమో అదిరిపోయింది, ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో విజువల్స్ అదిరిపోయాయి. ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 21 న అమెరికాలోని డల్లాస్ లో 22 న ఇండియాలో ఉదయం 8.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

New Update

శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 

ఇటీవలే వదిలిన 'నానా హైరానా' సాంగ్ అయితే యూట్యూబ్ లో ఏకంగా 50 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో విజువల్స్ తో పాటూ చరణ్, కియారా మేకోవర్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా డిజైన్ చేశారు. చూస్తుంటే ఈ సాంగ్ లోనే శంకర్ మార్క్ కనిపిస్తోంది.

ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

డిసెంబర్ 22 న ఫుల్ సాంగ్..

ఆయన సినిమాల్లో పాటలంటే లొకేషన్స్ అయినా సెట్ అయినా విజువల్స్ ఎంతో గ్రాండియర్ గా ఉంటాయి. ఈ పాట కూడా  గ్రాండియర్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇక ఈ ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 21 న అమెరికాలోని డల్లాస్ లో 22 న ఇండియాలో ఉదయం 8.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్, రోషిని, పృథ్వీ శృతి రంజని పాడారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు