'గేమ్ ఛేంజర్' లో ఆ రెండు ఎపిసోడ్లు.. ఫ్యాన్స్ కు పూనకాలే

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' లో ఇంట్వర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ యాక్షన్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని వినిపిస్తోంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది.

New Update
game changer11

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. 2025 లో భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. 

ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తున్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ రెండు ఎపిసోడ్స్ ను డైరెక్టర్ శంకర్ నెక్ట్స్ లెవెల్ లో తీసారట. ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఇప్పుడు దీని గురించే డిస్కషన్ నడుస్తోంది.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?

ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్..

'గేమ్ ఛేంజర్' లో ఇంట్వర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ స్టైలిష్ యాక్షన్ ను థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని వినిపిస్తోంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ షాక్ అవడం పక్కా అని ఈ రెండు ఎపిపోడ్స్ ను సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయని గట్టి టాక్ వినిపిస్తోంది. 

ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి, కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Also Read: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు